అపర రామానుజైన త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 108 దివ్య క్షేత్రాలు వెలిసి ఉన్నటువంటి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 9వ తారీకు నుంచి 19వ తారీకు వరకు సమతా కుంభ్ 2025 ఉత్సవాలు జరగనున్నాయని త్రిదండి శ్రీ అహోబిలం స్వామి వారు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీ రామనగరంలోని సమతామూర్తి దివ్యక్షేత్రంలో సమతా కుంభ్ – 2025 మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.. ఆదివారం నుంచి (ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు) 10 రోజులపాటు ఉత్సవాల్లో భాగంగా 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని త్రిదండి శ్రీ అహోబిలం స్వామి వారు తెలిపారు.
ఫిబ్రవరి పదో తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా విశేషంగా ప్రతిరోజు సాయంకాలం పూట 18 గరుడ వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీన 108 దివ్య క్షేత్రాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళందరికీ కూడా సాయంకాలం శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని.. ఒకే రోజున ఒకే సమయంలో 108 పెరుమాళ్ళ కళ్యాణాలు చూసే అదృష్టం కలగనుందని త్రిదండి శ్రీ అహోబిలం స్వామి తెలిపారు.
అలాగే 16వ తేదీన సాయంకాలం 18 దివ్యదేశ పెరమాళ్లకి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది.. ఇలాంటి వైభవోపేతం అయినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతాయన్నారు.
సమతా కుంభ్ 2025.. దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన అందరికీ దర్శనం ఇవ్వబోతున్నాయని ఇలాంటి ఉత్సవాల్లో భక్తులంతా పాలుపంచుకోవాలని శ్రీ త్రిదండి అహోబిలం స్వామి కోరారు..
రామానుజ – నూత్తందాది అంటే ఏమిటి?
భగవద్రామానుజులపై పరమ భక్తితో తిరువరంగత్తు అముదనార్ అనే శిష్యుడు సమర్పించిన 108 పాశురాలే..ఈ నూత్తందాది! రామానుజులవారిని ఆశ్రయించిన వారికి ఈ సంసారాన్ని జయించే అనుగ్రహము లభిస్తుందని నమ్మకం!
సనాతన వేద వైభవాన్ని భక్తులకు అనుగ్రహించిన రామానుజాచార్యులపై ఎనలేని భక్తి విశ్వాసాలతో ఈ నూత్తందాది రచించారు అముదనార్! ఆచార్య రామానుజులపై తన భక్తి ప్రపత్తులు ఉప్పొంగి రచించిన ప్రబంధం అత్యద్భుతం! ఇందులో పాశురం చివరి పదం తర్వాతి పాశురం మొదటి పదం అవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..