Success Astrology 2025: జ్యోతిష శాస్త్రంలో 3, 6, 10, 11 స్థానాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్థానాలను ఉపచయ స్థానాలుగా పరిగణించడం జరుగుతోంది. ఉపచయ స్థానాలంటే వృద్ధి స్థానాలని జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు. వీటిని బట్టి జాతకుడు ఏ స్థాయిలో, ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందేదీ అర్థం చేసుకోవచ్చు. జాతక చక్రంలోనే కాకుండా గ్రహ సంచారంలో కూడా ఈ స్థానాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నాలుగు స్థానాల్లోని గ్రహాలను బట్టి అభివృద్ధిని అంచనా వేయాల్సి ఉంటుంది.
Success Zodiac Signs
జ్యోతిష శాస్త్రంలో 3, 6, 10, 11 స్థానాలను ఉపచయ స్థానాలుగా పరిగణించడం జరుగుతోంది. ఉపచయ స్థానాలంటే వృద్ధి స్థానాలని అర్థం. వీటిని బట్టి జాతకుడు ఏ స్థాయిలో, ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందేదీ అర్థం చేసుకోవచ్చు. జాతక చక్రంలోనే కాకుండా గ్రహ సంచారంలో కూడా ఈ స్థానాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది. ఈ నాలుగు స్థానాల్లోని గ్రహాలను బట్టి అభివృద్ధిని అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు స్థానాలలోనూ గ్రహాలున్న పక్షంలో విశేషమైన అభివృద్ది సాధ్యమవుతుంది. ఒకే ఒక గ్రహం ఉంటే అభివృద్ధి లేదా వృద్ధి సామాన్యంగా ఉంటుంది. మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశులకు మరో మూడు నెలల పాటు విశేషమైన వృద్ధి యోగం పట్టడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశివారికి మూడవ స్థానంలో రాశ్యధిపతి కుజుడు, ఆరవ స్థానంలో కేతువు, పదవ స్థానంలో రవి, బుధులు, 11వ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా విశేషమైన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. అనేక మార్గాలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.
- వృషభం: ఈ రాశివారికి 10వ స్థానంలో శని, 11వ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక, అధికార యోగాలు కలుగుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభాలనిస్తాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది.
- సింహం: ఈ రాశికి 6వ స్థానంలో రవి, బుధులు, దశమంలో గురువు, లాభస్థానంలో కుజు సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నవారికైనా ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. భూ లాభం కలుగుతుంది. ఆదాయం విశేషంగా అభివృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి.
- కన్య: ఈ రాశివారికి 6వ స్థానంలో శనీశ్వరుడు, 10వ స్థానంలో కుజ సంచారం వల్ల ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఊహించని విధంగా ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. మనస్సులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. కొన్ని ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి.
- ధనుస్సు: ఈ రాశివారికి 3వ స్థానంలో శని, ఆరవ స్థానంలో రాశ్యధిపతి గురువు, దశమంలో కేతు సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత తొలగిపోయి, యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. జీవనశైలి మారిపోతుంది. ఈ రాశివారికి ఏదో విధమైన పురోగతి కలుగుతూనే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
- మకరం: ఈ రాశివారికి మూడవ స్థానంలో శుక్ర, రాహువులు, ఆరవ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం కూడా మెరుగైన స్థితిలో ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగపరంగా అనేక అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి ఉద్యోగ యోగం పడు తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు.
- మీనం: ఈ రాశివారికి 3వ స్థానంలో రాశ్యధిపతి గురువు, లాభ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల అదనపు ఆదాయ మార్గాలు ఊహించని ఆర్థిక యోగాలు కలిగిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అత్యధికంగా లాభాలు కలుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోవడం జరుగు తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి.