విక్టరీ వెంకటేశ్ నటించిన చిత్రాల్లో దృశ్యం సినిమా ప్రత్యేకం. 2014లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాకు తెలుగు రీమేక్ ఇది. జీతూ జోసేఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరోసారి వెంకటేశ్, మీనా జోడి అలరించింది. అలాగే ఇందులో వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. తన కూతురి భవిష్యత్తు, జీవితం కోసం ఓ తండ్రి పడే ఆరాటమే ఈ సినిమా. ఈ సినిమాలో వెంకీ పెద్ద కూతురిగా కనిపించిన అమ్మాయి గుర్తుందా..? సినిమా మొత్తం స్టోరీ ఆ అమ్మాయి చుట్టే తిరుగుతుంది. అందం, అంతకుమించిన అమాయకత్వంతో కట్టిపడేసింది. ఆ అమ్మాయి పేరేంటో తెలుసా.. ? కృతిక జయకుమార్. ఈ ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఓ క్లాసికల్ డ్యాన్సర్ కూడా.
బెంగుళూరుకు చెందిన కృతిక.. క్లాసికల్ డ్యాన్సర్. మొదటి నుంచి సినిమాలకు దూరంగానే ఉండేది. కానీ చిన్నప్పుడే భరతనాట్యంపై ఆసక్తి పెంచుకుంది. దీంతో ఆమెకు నృత్యం నేర్పించారు పేరెంట్స్. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో షోలలో పాల్గొంది. తిరువనంతపురంలో మలయాళం డైరెక్టర్ బాలు కిరియత్ ఆమెను చూసి సినిమాల్లో ట్రై చేయాలని సూచించగా.. తెలుగులో దృశ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా అందం, అభినయంతో కట్టిపడేసింది. ఈ సినిమాతో అటు మలయాళం, ఇటు తెలుగులోనూ చాలా ఫేమస్ అయ్యింది.
ఆ తర్వాత కన్నడలో బాక్సర్ అనే సినిమాలో నటించింది. తెలుగులో కథానాయికగా కాకుండా సహయ నటిగా కనిపించింది. తెలుగులో వినవయ్య రామయ్య, రోజులు మారాయి, ఇంట్లో దెయ్యం నాకేం భయం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా క్రేజ్ రాలేదు. అయితే కృతిక అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన