పాకిస్తాన్ క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆటగాళ్లలో బాబర్ ఆజం ముందువరుసలో ఉంటాడు. తన క్లాస్ బ్యాటింగ్, కూల్ అండ్ కామ్ నేచర్‌తో అభిమానులను సంపాదించుకున్న బాబర్, మైదానం లోపల, బయట కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే, ఈసారి అతని ఆట కారణంగా కాకుండా పాకిస్తాన్ మోడల్ దువా జహ్రా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వల్ల బాబర్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.
‘బాబర్ నా ప్రాణం.. అతడిని విమర్శిస్తే నా గుండె ముక్కలవుతుంది!’
ఇటీవల ARY జిందగీ చాట్ షోలో పాల్గొన్న ప్రముఖ మోడల్ దువా జహ్రా, బాబర్ ఆజంపై తనకున్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచింది. షోలో మాట్లాడుతూ,
“బాబర్ ఆజాం నాకు ఒక్కడే. అతనిపై నాకు విపరీతమైన ప్రేమ ఉంది. అతడిని ఎవరైనా విమర్శించినా, ట్రోల్ చేసినా, నేను దాన్ని అస్సలు సహించను. నా ముందు ఎవరు బాబర్ గురించి చెడుగా మాట్లాడినా, అది నన్ను ఎంతగానో బాధిస్తుంది. నా గుండె ముక్కలైపోయినట్టుగా అనిపిస్తుంది!” అని భావోద్వేగంగా స్పందించింది.
జహ్రా కేవలం బాబర్ ఆజం ఆటగాడిగా మాత్రమే కాకుండా, వ్యక్తిత్వాన్ని కూడా ఎంతో అభినందిస్తుందని పేర్కొంది. తాను సాధారణంగా సంబంధాలను నమ్మదని, కానీ వివాహాన్ని మాత్రం నమ్ముతానని చెప్పిన ఆమె, తనకు నిజాయితీ, నమ్మకద్రోహం లేని సంబంధాలే ఇష్టమని వివరించింది.
దువా జహ్రా చేసిన ఈ ఎమోషనల్ లవ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాబర్ ఆజంకు ఇంతటి అభిమాన మద్దతు ఉందా? అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు, బాబర్ మాత్రం ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీపై బాబర్ ఫోకస్
బాబర్ ఆజం ప్రస్తుతం తన క్రికెట్ కెరీర్‌పై మాత్రమే దృష్టి సారించాడు. ఫిబ్రవరి 8న లాహోర్‌లో జరగనున్న వన్డే ట్రై-సిరీస్‌లో అతడు ఆడనున్నాడు. అంతేకాదు, ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ జట్టులో అతను కీలక ఆటగాడిగా ఎంపికయ్యాడు.
పాకిస్తాన్ జట్టు షెడ్యూల్ ప్రకారం:
ఫిబ్రవరి 19న కరాచీలో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్, 23న దుబాయ్‌లో భారత్‌తో హైఓల్టేజ్ మ్యాచ్, 27న రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
దువా జహ్రా చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యల గురించి అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నా, బాబర్ మాత్రం తన క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కఠినమైన శిక్షణలో ఉన్నాడు. క్రికెట్ అభిమానులు బాబర్ ప్రొఫెషనల్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, అతని ఆటలోని మేటి నైపుణ్యాలను కొనియాడుతున్నారు.
ఓవైపు ప్రముఖ మోడల్ తన ప్రేమను బహిరంగంగా ప్రకటించడం, మరోవైపు బాబర్ ఆజం మాత్రం పూర్తి సైలెంట్‌గా ఉండటం, పాక్ మీడియా, అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. బాబర్ ఈ అంశంపై భవిష్యత్తులో స్పందిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
Model Dua Zahra confesses having Crush connected BABAR AZAM#BabarAzam𓃵 I #PakistanCricket pic.twitter.com/opy6J7B1xQ
— DoctorofCricket (@CriccDoctor) February 5, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..