మీకు ముక్కలేనిదే ముద్ద దిగదా..సండే వచ్చిందని..ముక్కలు కొనాలని..ఎంచక్కా మార్కెట్‌కు వెళ్తున్నారా..? అయితే జరంత ఆగండి. మీరు తినే మాంసంలో ఎలాంటి మోసం జరుగుతుందో గుర్తించండి..? కుళ్లిన టమోటాలనే మనం పక్కనపడేస్తాం. అలాంటిది మాంసం ఫ్రెష్షా.. లేక ఫ్రిడ్జ్‌లో నాన్చి నాన్చి తెచ్చారా.. అన్నది తెలుసుకుంటున్నారా..? అసలా మటన్‌కు వెటర్నరీ డాక్టర్ అప్రూవల్ ఉందో లేదో చెక్ చేశారా..? లేదు. వేలకు వేలు పెట్టి మటన్ కొనే మీరు.. ఆ మటన్ ఎక్కడ్నుంచి తెస్తున్నారో తెలుసుకుంటే మాత్రం గుండె గుభేల్‌మంటుంది.
ప్రజారోగ్యం కోసం, కల్తీ ఆహార పదార్థాల నివారణ కోసం కృషి చేస్తోన్న అధికారులు కృష్ణాజిల్లాలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మాంసం వ్యాపారుల దందాను బయటపెట్టింది. విజయవాడలో మటన్‌వ్యాపారులకు రూల్స్ ఉండవు. మేకలు, గొర్రెలను కొనుక్కుని రావడం వాటిని కోసి కిలోల చొప్పుల అమ్మేయడం మాత్రమే వీరికి తెలుసు. అయితే వీళ్లు కొనుక్కుని వచ్చే మేకలు, గొర్రెల్లో సగం వరకు రోగాలతో చనిపోయినవే. ఈ మాంసాన్ని ఫ్రెష్ మీట్ అని అమ్మేస్తున్నారు వ్యాపారులు. తిరువూరు, జగ్గయ్యపేట ,నందిగామ సంతలలో యదేచ్ఛగా.. మృతి చెందిన, కుళ్ళి పోయిన మేకపోతులను అమ్ముతున్నారు. చనిపోయిన మేక నుంచి వాసన రాకుండా ఉండేందుకు మేక పొట్టలో ఐస్ గడ్డలు పెట్టి విక్రయిస్తున్నారు.
మాంసం వ్యాపారులు సంతలో చనిపోయిన మేకలను, గొర్రెలను కొని.. మార్కెట్‌కు తీసుకొచ్చి కిలో 8 వందల నుంచి 11 వందల రూపాయల వరకు అమ్మేస్తున్నారు. అది కుళ్లిన మాంసం అని తెలియక తిన్నవారు అనారోగ్యం పాలవుతున్నారు. తలకాయ మాంసానికి విజయవాడలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మేకలు, గొర్రెల తలలు తెస్తున్నారు వ్యాపారులు. అయితే ఆ మేకల తలలను నెలల తరబడి ఫ్రిడ్జ్‌లో పెట్టి అమ్మేస్తున్నారు వ్యాపారులు. కల్తీ మాంసంపై ఫోకస్ పెట్టిన అధికారులు మార్కెట్‌లో తనిఖీలు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి