అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. మంగళవారం సాయంత్రం 4:30కి అమెరికాలో మొదలైన పోలింగ్ బుధవారం ఉదయం దాకా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే.. అమెరికా అధక్ష ఎన్నికల్లో తొలిఫలితం వచ్చేసింది. ఈ ఫలితాలలో కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య టై వచ్చింది. న్యూ హ్యంప్ షైర్ రాష్ట్రం డిక్స్‌విల్లే నాచ్‌లో అమెరికా ఎన్నికలకు వ్యక్తిగత ఓటింగ్ అర్ధరాత్రి ప్రారంభమైంది. కూస్ కౌంటీలో చిన్న టౌన్‌షిప్‌లో నవంబర్ 5 ఉదయం, ఆరుగురు ఓటర్లు వ్యక్తిగతంగా ఓటు వేశారు. కూస్ కౌంటీలో అమెరికా జాతీయగీతాన్ని ప్లే చేసిన తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. ఆరుగురు ఓటర్లు ఓటు వేసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించారు. ఫలితాలు కూడా వేగంగా వచ్చాయి. మూడు ఓట్లు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు వచ్చాయి.డెమోక్రటిక్ అభ్యర్థి హారిస్‌కు కూడా మూడు ఓట్ల వచ్చాయి. దీంతో ఈ కౌంటీలో ఫలితం టైగా ముగిసింది. ఈ ఫలితాన్ని బట్టే ఇక్కడ అధ్యక్ష ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరుగుతున్నాయో తెలుస్తోంది.
ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ లేక కమలా హారిస్ .. ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.. అధ్యక్ష పీఠంపై ఎవరికి వారు తమ విశ్వాసాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఎవరు గెలుస్తారన్న దానిపై భారీగా బెట్టింగ్ లు.. జోస్యాలు కూడా కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో థాయ్‌లాండ్‌కు చెందిన మూ డెంగ్ అనే బేబీ పిగ్మీ హిప్పోపొటామస్ యుఎస్ ఎన్నికల 2024కి ముందు ఎవరు గెలుస్తారో అన్న దానిపై అంచనా వేసింది..
రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ – డెమొక్రాట్ కమలా హారిస్ మధ్య నెక్ టు నెక్ రేసులో బేబీ హిప్పో తన విజేతను ఎన్నుకుంది.. అతనెవరో కాదు మాజీ అధ్యక్షుడు.. డోనాల్డ్ ట్రంప్.. ఆయన విజేతగా నిలుస్తారంటూ బేబీ పిగ్మీ హిప్పోపొటామస్ చెప్పిన అంచనాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఒక వైరల్ వీడియోలో, ఇంటర్నెట్ సంచలనం మూ డెంగ్ నీటి నుంచి బయటకు వచ్చింది.. అక్కడ దానికి ఆహారం ఎరగా ఉంచారు.. పిల్ల హిప్పోకు అభ్యర్థుల పేర్లు వ్రాసిన రెండు పుచ్చకాయలు ఇచ్చారు.. అది నేరుగా రిపబ్లికన్ నాయకుడు ట్రంప్ కోసం పుచ్చకాయ షెల్ ఉపయోగించి తయారు చేసిన పండ్ల బుట్ట వద్దకు వెళ్లి, దానిని ఆస్వాదించింది. థాయ్‌లాండ్‌లోని సి రాచాలోని ఖావో ఖీవ్ ఓపెన్ జూలో ఈ వీడియోను రికార్డ్ చేశారు.
వీడియో చూడండి:
Moo Deng, celebrated babe hippo, predicts Donald Trump volition triumph the election. pic.twitter.com/UqUnRhU0Nr
— The Rabbit Hole (@TheRabbitHole84) November 4, 2024
థాయిలాండ్‌కు చెందిన మూ డెంగ్, అబాబీ పిగ్మీ హిప్పోపొటామస్ వాస్తవానికి ఇంటర్నెట్ సంచలనం… దాని అంచనాలు నిజమవుతాయంటూ నమ్ముతుంటారు..
మూ డెంగ్ అంచనా అన్ని పోల్స్ – బెట్టింగ్‌లకు మద్దతు ఇస్తుందంటూ ట్రంప్ అభిమానులు, జూ నిర్వాహకులు పేర్కొంటున్నారు. అట్లాస్ఇంటెల్ తాజా పోల్ ప్రకారం, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ముఖ్యంగా మొత్తం ఏడు రాష్ట్రాలలో భారీ అంచనాలతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది..
49% మంది ప్రతివాదులు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేస్తామని చెప్పారు.. రిపబ్లికన్లు అతని కౌంటర్ డెమొక్రాట్ కమలా హారిస్ కంటే 1.8% ఓట్ల ఆధిక్యాన్ని కలిగి ఉన్నట్లు పోల్ చూపిస్తుంది. ప్రఖ్యాత ఆర్థికవేత్త క్రిస్టోఫ్ బరౌడ్, “ప్రపంచంలోని అత్యంత ఖచ్చితమైన ఆర్థికవేత్త” అని పిలుస్తారు.. ఆయన కూడా “ట్రంప్ దే విజయం” అని అంచనా వేశారు.
లిటిల్ పొలిటికల్ అనలిస్ట్ “మూ డెంగ్” గురించి..
జూలై 2024లో జన్మించిన మూ డెంగ్ ఒక సెలబ్రిటీ హిప్పో.. ఇంటర్నెట్ సంచలనం.. అది సరదా చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటుంది.. దీనికి సంబంధించిన వీడియోలను టిక్‌టాక్ – ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో హిప్పో వైరల్ అయ్యింది.
ఇటీవల ఆమె తన “మూన్‌వాక్” తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.. ఇది అమెరికన్ గాయకుడు-డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ ఐకానిక్ డ్యాన్స్ మూవ్‌ను గుర్తు చేస్తుంది. దీనికి ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు.. దీనివల్ల సెప్టెంబర్‌లో జూ ఆదాయం 4 రెట్లు పెరిగినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు.