అడ్వెంచర్‌లో అనుభూతి ఉన్నా.. దాని తగ్గ రిస్క్‌లు కూడా లేకపోలేదు. అయితే చాలామందికి అడ్వెంచర్ రైడ్స్ అంటే ఇష్టముంటుంది. ఇక వారిలో మీరూ ఒకరైతే..? మీకోసమే ఈ వార్త.. ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో ప్రయాణ అనుభూతిని పొందాలనుకుంటున్నారా.? అలాంటి అడ్వెంచర్ చేయడం మీకిష్టమేనా.? అయితే మీరు తప్పకుండా వెళ్లాల్సింది తమిళనాడులోని కొల్లిహిల్స్ రోడ్డు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మాత్రమే కాదు.. ఇండియాలోని అత్యంత భయంకరమైన రోడ్లలో ఒకటిగా పరిగణిస్తారు.
ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్
ఈ రోడ్డులో ప్రతి 200 మీటర్లకు ఓ హెయిర్‌పిన్ వంపు వస్తుంది. సుమారు 46.7కిమీల ఈ రోడ్డు 70 హెయిర్ పిన్ వంపులతో అడ్వెంచర్ ప్రియులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది. అలాగే ఈ రోడ్డు మార్గం కేవలం బైక్‌లు వెళ్లడానికే వీలుగా ఉంటుంది. దీన్ని మౌంటైన్స్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. అటు ఈ పర్వతాల చుట్టుప్రక్కల ఉండే లోకేషన్లు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు
అటు సిక్కింలోని జిగ్ జాగ్ రోడ్ కూడా కొల్లిహిల్స్ రోడ్డు మాదిరిగా ఉంటుంది. దాదాపుగా 100 హెయిర్ పిన్ వంపులు ఉన్న ఈ రోడ్డులో బైకర్లు, డ్రైవర్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటారు. ఇక ఈ మార్గంలో ప్రయాణించాలంటే అనుమతులు పొందటమే కాదు.. వాతావరణ పరిస్థితులను కూడా ముందుగా తెలుసుకుని బయల్దేరాలి.
ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..