ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కేవలం గ్రౌండ్‌లో కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా తన మంచితనంతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. కోహ్లీ తాజాగా మరోసారి తన నిస్వార్థ ప్రేమను చాటుకున్నాడు. రాత్రంతా చలిలో తన కోసం ఎదురు చూసిన అభిమానులకు అతడు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే?
తాజాగా విరాట్ కోహ్లీ తన సొంత ఊరు దిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో దేశవాళీ క్రికెట్ రంజీ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అతడి ఆట అంచనాలకు తగ్గట్టుగా లేకపోయినా, కోహ్లీని చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అంచనా ప్రకారం, దాదాపు 16 వేల మంది ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. మ్యాచ్ అనంతరం స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, కొంతమందితో ఫోటోలు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ తన నివాసానికి వెళ్లిపోయాడు.
అయితే ఇద్దరు యువకులు మాత్రం విరాట్ కోహ్లీని దగ్గరగా కలవాలని ఆశించి, అతడి నివాసం దగ్గర రాత్రంతా చలిలోనే వేచి ఉండిపోయారు. వీరి గురించి సమాచారం తెలుసుకున్న కోహ్లీ తానే స్వయంగా ఇంటి తలుపులు తెరిచి వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. కేవలం కలవడం మాత్రమే కాకుండా, వారితో ముచ్చటిస్తూ, ఆటోగ్రాఫ్ ఇచ్చి, మరింత ప్రత్యేకమైన జ్ఞాపకాలను అందించాడు.
ఫ్యాన్స్‌కు మర్చిపోలేని అనుభూతి
విరాట్ ఫ్యాన్స్‌ను తన ఇంటికి పిలిచి మాట్లాడటం, ఆటోగ్రాఫ్ ఇవ్వడం చూసి నెటిజన్లు అతడి గొప్ప మనసుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ అపూర్వమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోహ్లీ ఇచ్చిన ఆశ్చర్యకరమైన గిఫ్ట్‌తో ఆ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విరాట్ కోహ్లీ కేవలం గ్రేట్ ప్లేయర్ మాత్రమే కాదు, గొప్ప హృదయమున్న వ్యక్తి అని మరోసారి నిరూపించుకున్నాడు!
ఈ ఘటన మరోసారి అతడి వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. సాధారణంగా అంతటి క్రికెట్ లెజెండ్ అయిన వ్యక్తి తన ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం చాలా అరుదైన విషయం. కానీ కోహ్లీ మాత్రం తన అభిమానం చూపించే ప్రతి ఒక్కరికీ విలువ ఇస్తాడు. అతడి ఈ జెస్టర్ సోషల్ మీడియాలో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అభిమానులను గౌరవించే అతడి స్వభావమే విరాట్‌ను అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిపేస్తుంది!
Fans waited for hours during nighttime extracurricular Virat Kohli's location successful Gurugram.
– Virat called the fans wrong his location and gave them autographs. 🥹❤️ pic.twitter.com/uW6luzbj79
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 3, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..