Visakha Railway Zone: దశాబ్దాల కల.. విశాఖ రైల్వే జోన్‌ ప్రక్రియలో మరో ముందడుగు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..

2 hours ago 1

విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చింది నాటి కేంద్ర ప్రభుత్వం. అయితే గత పదేళ్లుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా జోన్‌ వ్యవహారం ముందుకు సాగలేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో కేంద్రం నుంచి విశాఖ రైల్వేజోన్‌పై కదలిక వచ్చింది. తాజాగా విశాఖపట్నంలో జోనల్ కార్యాలయం నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియను ప్రారంభించింది..రైల్వేశాఖ. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌లో స్వయంగా ఈ విషయం ప్రకటించారు. దీంతో విశాఖ వాసుల్లో ఆనందం నెలకుంది.

Notice inviting tender for bureau operation to acceptable up the South Coast Railway Zone astatine Visakhapatnam. pic.twitter.com/6O9mQdRdiI

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 24, 2024

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల29న విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విశాఖ రైల్వే జోన్‌కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారని చెబుతున్నాయి రైల్వే వర్గాలు.. ఈ క్రమంలోనే రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు ఇప్పటికే 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది రాష్ట్రప్రభుత్వం. మొత్తం 11 అంతస్తుల్లో 149.16 కోట్ల వ్యయంతో జోనల్‌ కార్యాలయ నిర్మాణం చేపడుతోంది రైల్వేశాఖ.

టెండర్లు దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 27 వరకూ గడువు విధించింది. టెండర్లు దక్కించుకున్నవాళ్లు రెండేళ్లలో పనులు పూర్తిచేయాలని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అయితే భవనం పూర్తయ్యేవరకూ ఎదురు చూడకుండా తాత్కాలిక భవనాల్లో అయినా సౌత్‌కోస్ట్‌ జోన్‌ కార్యకలాపాలను ప్రారంభించాలని విశాఖ వాసులు కోరుతున్నారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article