ఇంటర్‌నెట్ ప్రపంచం అంటేనే వింతలు, విశేషాలు, షాకింగ్ సంఘటనల ప్రపంచం. ఇక్కడ ప్రతి నిత్యం వందల వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో అడవి జంతువులు సింహాలు, పులులు, మొసళ్లు, ఏనుగులు. పాములు, పక్షులు, కోతులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం ఉంటాయి. ఈ క్రమంలోనే అడవి జంతువులు కొన్ని సార్లు ఊర్లమీద పడి విధ్వంస చేసిన సంఘటనలు కూడా చూస్తుంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏనుగులు కూడా ఆహారం, నీళ్ల కోసం అడవిలోంచి జనావాసాల్లోకి వస్తుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఒక ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఊర్లోకి వచ్చిన ఏనుగు ఓ ఇంట్లోకి దూరింది..ఆ తరువాత ఆ ఏనుగు ఏం చేసిందో మీరే చూడండి
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినదిగా తెలిసింది. వీడియో ప్రకారం.. జనవరి 18 శనివారం రాత్రి ఒక అడవి ఏనుగు ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లో నలుగురు కార్మికులు ఉన్నట్టుగా తెలిసింది. రాత్రి సమయంలో వచ్చిన అనుకోని అతిథిని చూడగానే ఆ ఇంట్లోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ, చాకచక్యంగా వ్యవహరించి వారు ఏనుగు కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే, ఆ ఏనుగు చేస్తుందో చూడాలని ఈ సంఘటనను వారు ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
#sputnikviral | 🐘🇮🇳 An elephant drops by for a astonishment sojourn successful the Indian metropolis of Coimbatore
The mischievous carnal snagged a packet of atom and made a expansive exit! pic.twitter.com/d7IkfZXcCI
— Sputnik Africa (@sputnik_africa) January 20, 2025
అదృష్టవశాత్తూ, ఆ ఏనుగు ఇంట్లోకి ప్రవేశించకలేకపోయింది. కానీ, ఒక పాదం ఇంట్లోకి వేసి ఆ ఇళ్లంతా నాశనం చేసింది. ఇంట్లోని వంటసామాగ్రి, గ్యాస్ స్టౌవ్‌ను విధ్వంసం చేసింది. అప్పటికే స్టౌవ్‌మీద వండుతున్న అన్నం కూడా నేలపాలు చేసింది..దానికి ఎలాంటి ఆహారం కనిపించకపోవటంతో ఆ ఏనుగు మరింత ఆగ్రహంతో ఇంట్లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి చేతికి దొరికి బియ్యం బస్తాను దానికి దగ్గరగా విసిరాడు.. దాంతో ఆ బియ్యం బ్యాగ్ తీసుకున్న ఏనుగు అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోయింది. దాంతో లోపల ఉన్న నలుగురు వలస కార్మికులు క్షేమంగా బయటపడ్డారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న కార్మికులు వంట చేస్తుండగా, సమీపంలో ఏనుగు వస్తున్నట్లు గమనించారు. వెంటనే స్పందించి, గ్యాస్ స్టవ్‌ను ఆపివేశారు. కానీ, ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ ఆ గజరాజు ఇంటిని చిందరవందర చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..