Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు

3 hours ago 1

వార ఫలాలు (జనవరి 19-25, 2025): మేష రాశి వారికి ఈ వారం రోజులు జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ముఖంగా ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతాలు పెరగడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. మిథున రాశి వారికి ఈ వారం ఆదాయం కొద్దో గొప్పో పెరగడమే తప్ప తగ్గడం జరగదు. ఆర్థిక వ్యవహారాల్లో వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 19, 2025 | 5:01 AM

 ప్రస్తుతానికి గురు, శని, రవి, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. రాశ్యధిపతి కుజుడు కూడా చతుర్థంలో ఉన్నందువల్ల కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి బయటపడతారు. వారం రోజుల పాటు జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ముఖంగా ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. కుటుంబపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపా రాలు ఆశించిన రీతిలో అభివృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ప్రస్తుతానికి గురు, శని, రవి, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. రాశ్యధిపతి కుజుడు కూడా చతుర్థంలో ఉన్నందువల్ల కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి బయటపడతారు. వారం రోజుల పాటు జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ముఖంగా ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. కుటుంబపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపా రాలు ఆశించిన రీతిలో అభివృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

1 / 12

 రాశ్యధిపతి శుక్రుడు, దశమాధిపతి శని దశమ స్థానంలో కలిసినందువల్ల ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతాలు పెరగడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధనాధిపతి బుధుడు అనుకూలంగా లేని కారణంగా ఆదాయం తగ్గడం, రావల సిన డబ్బు రాకపోవడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు, చికాకులు తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలు న్నాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు, దశమాధిపతి శని దశమ స్థానంలో కలిసినందువల్ల ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతాలు పెరగడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధనాధిపతి బుధుడు అనుకూలంగా లేని కారణంగా ఆదాయం తగ్గడం, రావల సిన డబ్బు రాకపోవడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు, చికాకులు తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలు న్నాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు.

2 / 12

 ఈ రాశికి ప్రస్తుతం శుక్ర, రాహు, కుజ, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ధన ధాన్యాలకు లోటుండకపోవచ్చు. ఆదాయం కొద్దో గొప్పో పెరగడమే తప్ప తగ్గడం జరగదు. ఆర్థిక వ్యవహారాల్లో వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు తప్పకుండా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. దూరపు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు ప్రముఖులు బాగా సన్నిహితమవుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులకు సహాయపడతారు. తలపెట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యు లతో ఆలయ సందర్శన చేసుకుంటారు. నిరుద్యోగులకు ఆఫర్లు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశికి ప్రస్తుతం శుక్ర, రాహు, కుజ, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ధన ధాన్యాలకు లోటుండకపోవచ్చు. ఆదాయం కొద్దో గొప్పో పెరగడమే తప్ప తగ్గడం జరగదు. ఆర్థిక వ్యవహారాల్లో వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు తప్పకుండా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. దూరపు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు ప్రముఖులు బాగా సన్నిహితమవుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రులకు సహాయపడతారు. తలపెట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యు లతో ఆలయ సందర్శన చేసుకుంటారు. నిరుద్యోగులకు ఆఫర్లు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

3 / 12

 లాభ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో రవి సంచారం ఆదాయ వృద్ధికి అవకాశం కల్పిస్తాయి. ఆదాయంతో పాటు ఆరోగ్యానికి కూడా లోటుండదు. తండ్రి వైపు నుంచి ధన లాభాలు కలుగు తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో రవి సంచారం ఆదాయ వృద్ధికి అవకాశం కల్పిస్తాయి. ఆదాయంతో పాటు ఆరోగ్యానికి కూడా లోటుండదు. తండ్రి వైపు నుంచి ధన లాభాలు కలుగు తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

4 / 12

 సప్తమ స్థానంలో శని, శుక్రులు కలవడం వల్ల పని ఒత్తిడి ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యో గంలో స్థిరత్వానికి లోటుండదు. ఉద్యోగమూలక ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో పరిచయాల వల్ల సామా జికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా ఉపయోగ పడతాయి. తలపెట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగ లభించే అవకాశం ఉంది. పిల్లల వృద్ధిలోకి వస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సప్తమ స్థానంలో శని, శుక్రులు కలవడం వల్ల పని ఒత్తిడి ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యో గంలో స్థిరత్వానికి లోటుండదు. ఉద్యోగమూలక ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో పరిచయాల వల్ల సామా జికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా ఉపయోగ పడతాయి. తలపెట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగ లభించే అవకాశం ఉంది. పిల్లల వృద్ధిలోకి వస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

5 / 12

 భాగ్య స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల కొన్ని ఆర్థిక, వ్యక్తిగత, దాంపత్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. అనుకోకుండా మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): భాగ్య స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల కొన్ని ఆర్థిక, వ్యక్తిగత, దాంపత్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. అనుకోకుండా మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు.

6 / 12

 రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో శనితో కలిసి ఉండడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ పని తీరు ఎంతగానో సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. చతుర్థ స్థానంలో రవి సంచారం వల్ల మనశ్శాంతికి, సుఖ సంతోషాలకు లోటుండదు. సాధారణంగా ఏ పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఎవరికీ ఆర్థిక విష యాల్లో వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు. విదేశాల్లో  వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.  ఆరోగ్యానికి ఢోకా లేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో శనితో కలిసి ఉండడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ పని తీరు ఎంతగానో సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. చతుర్థ స్థానంలో రవి సంచారం వల్ల మనశ్శాంతికి, సుఖ సంతోషాలకు లోటుండదు. సాధారణంగా ఏ పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఎవరికీ ఆర్థిక విష యాల్లో వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు.

7 / 12

 ధన స్థానంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, సప్తమంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా ఈ వారం శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. రాశ్యధిపతి కుజుడు కూడా భాగ్య స్థానంలో ఉన్నందువల్ల ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికతరంగా సాగిపోతాయి. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొం టారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ధన స్థానంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, సప్తమంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా ఈ వారం శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. రాశ్యధిపతి కుజుడు కూడా భాగ్య స్థానంలో ఉన్నందువల్ల ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికతరంగా సాగిపోతాయి. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొం టారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

8 / 12

 రాశ్యధిపతి గురువు ఆరవ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నందువల్ల శత్రు, రోగ, రుణ సమ స్యలు బాగా తగ్గి ఉంటాయి. ధన స్థానంలో రవి సంచారం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగపరంగా కొన్ని అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. మీ పనితీరుతో పాటు, మీ సలహాలు, సూచనలతో కూడా అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాలు కూడా సంతృప్తికరంగా, సానుకూ లంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది.  జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.  నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు ఆరవ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నందువల్ల శత్రు, రోగ, రుణ సమ స్యలు బాగా తగ్గి ఉంటాయి. ధన స్థానంలో రవి సంచారం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగపరంగా కొన్ని అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. మీ పనితీరుతో పాటు, మీ సలహాలు, సూచనలతో కూడా అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాలు కూడా సంతృప్తికరంగా, సానుకూ లంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి.

9 / 12

 ధన స్థానంలో రాశ్యధిపతి శనితో శుక్రుడు కలవడం, పంచమంలో గురువు సంచారం, తృతీయ స్థానంలో రాహువు వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల, ప్రయత్నాల వల్ల బాగా లాభం ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో పనిభారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అనా రోగ్య సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సంతృప్తికరంగా ముగుస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో రాశ్యధిపతి శనితో శుక్రుడు కలవడం, పంచమంలో గురువు సంచారం, తృతీయ స్థానంలో రాహువు వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల, ప్రయత్నాల వల్ల బాగా లాభం ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో పనిభారం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అనా రోగ్య సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సంతృప్తికరంగా ముగుస్తాయి.

10 / 12

 ఈ రాశిలో రాశ్యధిపతి శనితో శుక్ర గ్రహం యుతి చెందడం, లాభ స్థానంలో బుధ సంచారం బాగా యోగదాయకంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన హోదా లభించే అవ కాశం ఉంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు కొద్ది ప్రయత్నంతో పూర్తయి ఊరట కలుగుతుంది. ప్రముఖులతో పరి చయాలు వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు  బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగ ప్రయ త్నాల్లో విజయాలు వరిస్తాయి. బంధువర్గంలో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశిలో రాశ్యధిపతి శనితో శుక్ర గ్రహం యుతి చెందడం, లాభ స్థానంలో బుధ సంచారం బాగా యోగదాయకంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన హోదా లభించే అవ కాశం ఉంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు కొద్ది ప్రయత్నంతో పూర్తయి ఊరట కలుగుతుంది. ప్రముఖులతో పరి చయాలు వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగ ప్రయ త్నాల్లో విజయాలు వరిస్తాయి. బంధువర్గంలో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది.

11 / 12

 దశమ స్థానంలో బుధుడు, లాభ స్థానంలో రవి సంచారం చేస్తున్నందువల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురో గతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతాయి. రాశ్యధిపతి గురువు తృతీయ స్థానంలో సంచారం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం కావడం, ప్రయాణాలు బాగా లాభిం చడం వంటివి తప్పకుండా జరుగుతాయి. కొందరు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యయ స్థానంలో శుక్ర, శనుల సంచారం వల్ల అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): దశమ స్థానంలో బుధుడు, లాభ స్థానంలో రవి సంచారం చేస్తున్నందువల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురో గతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతాయి. రాశ్యధిపతి గురువు తృతీయ స్థానంలో సంచారం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం కావడం, ప్రయాణాలు బాగా లాభిం చడం వంటివి తప్పకుండా జరుగుతాయి. కొందరు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యయ స్థానంలో శుక్ర, శనుల సంచారం వల్ల అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందుతాయి.

12 / 12

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article