బాలీవుడ్ ఇండస్ట్రీలో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరోపై దాడి చేసిన ప్రధాన నిందితుడిని ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసారు. అతడి పేరు విజయ్ దాస్ అని సమాచారం. నిన్న అర్దరాత్రి థానేలోని కసర్వద్వాలి ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడిని ఖర్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. బాంద్రా పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్, థానే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని థానేలోని హీరానందానీ ఎస్టేట్‌లోని టిసిఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ స్థలం సమీపంలో ఉన్న లేబర్ క్యాంప్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దాస్ మొదట్లో థానేలోని హీరానందని ప్రాంతంలో పనిచేసేవాడు. కాబట్టి అతడికి ఈ ప్రాంతంపై పూర్తిగా అవగాహన ఉంది. సైఫ్ దాడి చేసిన అనంతరం థానేలోని లేబర్ క్యాపు సమీపంలోని అడవిలో విజయ్ దాస్ దాక్కున్నట్లు సమాచారం. అంతకు ముందు అతడు ముంబైలోని ఓ పబ్‌లో పనిచేసినట్లు విచారణలో తేలింది. నిందితుడు విజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు. ముంబై పోలీసు అధికారులు ఈ రోజు ఉదయం 9 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ విషయంపై అప్‌డేట్ ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. సైఫ్ పై దాడి జరిగి నేటికి నాలుగు రోజులు. దాడి ఘటన రోజు నుంచి ముంబై పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి నిందితులు ఎలా ప్రవేశించారు? నిందితుడి ఉద్దేశం ఏమిటి? ఈ పనిలో అతనికి మద్దతుగా ఇంకెవరైనా ఉన్నారా? అతను ఇంకా ఎంత మంది బాలీవుడ్ నటుల ఇళ్లకు రీకీ చేశాడు? సైఫ్ ఇంటికి వెళ్లడంలో అతని ఉద్దేశం ఏమిటి? ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నాడు? నిందితుడు సైఫ్ ఇంటికి చేరిన వ్యక్తి ఎవరు? ఇలా ఎన్నో పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈరోజు విచారణలో పోలీసులకు ఈ విషయంపై సమాధానం లభించనుంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..