యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. మహా కుంభ సంప్రోక్షణ తర్వాత సీఎం కేసీఆర్ లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయాలని, అందుకు భక్తులందరిని భాగస్వామ్యం భావించారు. మహా కుంభ సంప్రోక్షణ తేదీ ప్రకటించిన రోజే మాజీ సీఎం కేసీఆర్ సహా 22 కిలోల బంగారం ఇచ్చే దాతల వివరాలు ప్రకటించారు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమాన గోపురాన్ని బంగారు తాపడం కోసం మొదటగా తన కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించారు. కుటుంబంతో కలిసి వచ్చిన కేసీఆర్ కిలో 16 తులాల బంగారాన్ని స్వామివారికి విరాళంగా అందజేశారు.
ప్రధాన ఆలయ దివ్య గోపురం స్వర్ణ తాపడానికి మొత్తం 127 కిలోల బంగారు తాపడం కోసం రూ.65 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. స్వర్ణ తాపడానికి ఆశించినట్లుగా దాతల నుంచి స్పందన రాలేదు. దాతల నుంచి విరాళాల ద్వారా పదకొండు కిలోల బంగారం, రూ.20 కోట్ల నగదు సమకూరింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. ఆలయ అధికారులతో స్వర్ణ తాపడంపై సమీక్షించారు. ఆలయ హుండీల ద్వారా వచ్చిన 1300 కిలోల వెండి, నగల రూపంలో వచ్చిన బంగారాన్ని విమాన గోపురం తయారీకి వినియోగించింది.
ఇవి కూడా చదవండి
చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు స్వర్ణ తాపడం పనులను అప్పగించారు. స్వర్ణ తాపడం కూలి పనులకు అవసరమైన ఏడు కోట్ల మొత్తాన్ని దేవస్థానం చెల్లిస్తుంది. దివ్య విమాన గోపురానికి అమర్చే బంగారు రేకులను చెన్నై నుంచి ఆలయానికి తరలించారు. బంగారు రేకులను ప్రధాన ఆలయంలో అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ గోపురానికి బంగారు రేకులు అమర్చే పనులను ప్రారంభించారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..