ప్రజలకు చాలా వింతగా అనిపించే కొన్ని వ్యాధులు ఉన్నాయి. జీవితాంతం వారు ఆ వ్యాధితోనే జీవించాల్సి ఉంటుంది. అలాగే, కొంతమందికి వచ్చే వ్యాధులు చాలా వింతగా ఉంటాయి. ఆహారం, దుమ్ము, నీరు వంటి ప్రాథమిక వస్తువుల ద్వారా కూడా వారు అనారోగ్యానికి గురవుతారు. తాజాగా అలాంటిదే ఒక అమ్మాయికి ఇలాంటి వ్యాధి ఒకటి బయటపడింది. అందులో ఆమెకు ఆహార పదార్థాల నుండి నీటి వరకు 40 కంటే ఎక్కువ వస్తువుల వల్ల అలెర్జీ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ ఆ అమ్మాయి తన జీవితంలో చాలా సంతోషంగా ఉంది. అవును మీరు విన్నది నిజమే..!
19 ఏళ్ల క్లోయ్ రామ్సే అనే యువతి పుట్టినప్పటి నుండి కొన్ని విషయాల పట్ల అలెర్జీ ఉండేది. పరిస్థితి ఎలా ఉందంటే, అరటిపండు, బంగాళాదుంప వంటివి తిన్న తర్వాత ఆమెకు అనాఫిలాక్టిక్ షాక్ వచ్చేది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఈ విషయాల గురించి తెలియకపోయినా, తాను పెద్దయ్యాక ఈ సమస్య మరింత పెరిగిందని చెప్పింది. ఇలాంటి పదార్థాలు తిన్నప్పుడు రామ్సే నోరు, గొంతు ప్రమాదకరంగా ఉబ్బడం, చర్మంపై తీవ్రమైన ప్రభావాలను చూపే 40 పదార్థాలను గుర్తించినట్టుగా చెప్పింది. వాటిలో అరటిపండు, కివి, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, పియర్, ద్రాక్ష వంటి వాటి వల్ల అలెర్జీ ఉంటుందని చెప్పింది.
వైద్యులు క్లోయ్ పరిస్థితిని నిశితంగా పరిశీలించినప్పుడు ఆమె తీవ్రమైన పుప్పొడి అలెర్జీ వ్యాధితో బాధపడుతుందని గ్రహించారు. ఈ వ్యాధి కారణంగా రోగులు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. రోగి పొరపాటున కూడా ఈ పండ్లను తింటే అతని గొంతు తీవ్రంగా వాచిపోతుందని చెప్పారు. ఇది కాకుండా, క్లోయ్ గురించి విచిత్రమైన విషయం ఏమిటంటే ఆమెకు నీటికి అలెర్జీ కూడా ఉంది. దీనిని ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అంటారు.
ఇవి కూడా చదవండి
తన పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడుతూ తన చర్మంపై నీళ్లు పడినప్పుడు, ఎవరో తనపై కత్తితో దాడి చేసినట్లు అనిపిస్తుందని అన్నారు. అయితే, అదృష్టవశాత్తు తను ఇతరులకన్నా చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. తనకు ఉన్న ఎలర్జీ ఎఫెక్ట్స్ అంత ప్రమాదకరమైనవి కాదని చెప్పారు. తనకున్న అలెర్జీలకు చికిత్స చేయడానికి తాను జీవితాంతం ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..