బాగా తెగించావురా నువ్వు.. చూస్తా నీ సంగతి చూస్తానంటూ అదుర్స్‌లో బ్రహ్మి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా..! దీన్నే కాస్త మారుద్దామిప్పుడు..! అక్కడ తెగించింది నిర్మాతలైతే.. వాళ్ల సంగతి చూస్తామంటున్నది వివాదాలు. కాసులు కురిపిస్తున్న కాంట్రవర్సీ స్టోరీస్ వైపు అడుగులు వేస్తున్నారు మేకర్స్. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలే కాదు.. వాటికి అమ్మమ్మ లాంటి కాంట్రవర్షియల్ కథలు రెడీ అవుతున్నాయిప్పుడు.
Razakar
Updated on: Feb 07, 2025 | 11:34 AM
బాగా తెగించావురా నువ్వు.. చూస్తా నీ సంగతి చూస్తానంటూ అదుర్స్‌లో బ్రహ్మి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా..! దీన్నే కాస్త మారుద్దామిప్పుడు..! అక్కడ తెగించింది నిర్మాతలైతే.. వాళ్ల సంగతి చూస్తామంటున్నది వివాదాలు. కాసులు కురిపిస్తున్న కాంట్రవర్సీ స్టోరీస్ వైపు అడుగులు వేస్తున్నారు మేకర్స్. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలే కాదు.. వాటికి అమ్మమ్మ లాంటి కాంట్రవర్షియల్ కథలు రెడీ అవుతున్నాయిప్పుడు. మూడేళ్ళ కింద వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇండియాలో వివాదాస్పద సినిమాలకు డిమాండ్ పెరిగింది. కేరళ స్టోరీతో వాటికి మరింత ఊపొచ్చింది. ఇదే తరహాలో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా వచ్చేస్తుంది. షూటింగ్ దశలో ఉండగానే.. దీన్ని నిషేధించాలని బెంగాల్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. ఇదే అనుకుంటే తాజాగా ఢిల్లీ ఫైల్స్ సినిమా వచ్చేస్తుంది.
‘ది కశ్మీర్ ఫైల్స్’లో కశ్మీర్ పండిట్‌లపై జరిగిన అరాచకాలను చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. ఈసారి ‘ది దిల్లీ ఫైల్స్’ సినిమాతో వస్తున్నారు. ‘ది బెంగాల్ ఛాప్టర్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. మిథున్ చక్రవర్తి రాజ్యంగంలోని భారత రాజ్యాంగ ప్రవేశికను చదువుతూ నడుస్తున్నట్లు టీజర్‌లో చూపించారు. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోధ్రా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన సబర్మతి అల్లర్ల నేపథ్యంలో సబర్మతి రిపోర్ట్ సినిమా ఈ మధ్యే వచ్చింది. గోధ్రా ఘటనపైనే అదే పేరుతో మరో సినిమా కూడా వస్తుంది. నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌజ్ కూడా ఒకింత వివాదాస్పద కథే. ఇందులో వీర్ సావర్కర్ నేపథ్యం ఉంటుంది. ఈ సినిమాలన్నీ ఎప్పుడు విడుదలైనా.. వివాదమవ్వడం మాత్రం ఖాయం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి