కానీ, కొన్నేండ్ల క్రితమే ఓ సాధారణ రైతు ఓ రైలుకు ఓనర్ అయిన అసాధారణ విషయం ఎంత మందికి తెలుసు? రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక రైతు కొన్నాళ్లు యజమానిగా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకోవాలంటే పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకోవాలి. 2007లో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో రైల్వే అధికారులు చేసిన తప్పిదమే ఇందుకు కారణం. లుథియానాలోని కటానా అనే గ్రామంలో భూసేకరణ కోసం రైతులకు ఎకరానికి 25లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, కొన్నాళ్లకు తమ సమీప గ్రామంలో ఎకరానికి 71 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినట్లు తెలుసుకున్న సంపూరణ్ సింగ్ అనే రైతు తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టు మెట్లెక్కారు. తమకూ అంతే మొత్తంలో పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయపోరాటం సాగించారు. దీంతో రైల్వే శాఖ ఎకరానికి పరిహారాన్ని 25లక్షల నుంచి 50లక్షల రూపాయలకు పెంచింది. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆపై పరిహారం ఒక కోటి 47 లక్షలకు పెరిగింది. ఈ మొత్తాన్ని నార్తన్ రైల్వే 2015 లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ రైల్వే అధికారులు చెల్లించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 02: సోషల్ మీడియాలో పుష్పరాజ్ అరాచకం..
ఇలా చేశారంటే.. ఎంత పెద్ద తోపులైనా ఏమీ చేయలేరు !!
మతిమరుపు మంచిదే.. మర్చిపోకుంటేనే డేంజర్… ఎందుకలా ??
రక్తం తాగి బతికే వాంపైర్ గబ్బిలాలపై ప్రయోగం.. ఎందుకలా ??
నా బ్రెయిన్‌లో మెషిన్ పెట్టారు.. డీ యాక్టివేట్ చేయండి !! ఏపీ టీచర్ వింత పిటిషన్