సోషల్ మీడియాలో ఇప్పడు చాలా ట్రెండ్స్ నడుస్తున్నాయి. రోజుకొక వెరైటీ నెట్టింట వైరల్ అవుతుంది. జనాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో సినిమా వాళ్ళ గురించి ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి. అందులోనూ సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈమె టాలీవుడ్‌లో చేసింది రెండు సినిమాలే. అవి రెండూ సూపర్ హిట్స్. దీంతో ఇమేజ్.. పీక్‌కి చేరింది. కుర్రాళ్లు అయితే తన పేరు చెబితేనే మ్యాడై పోతున్నారు. తమ ప్రజెంట్ క్రష్ అని కామెంట్స్ పెడుతున్నారు. తను మా క్వీన్ అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
పలువురు స్టార్ మేకర్స్ ఆమె డేట్స్ కోసం వెంపర్లాడుతున్నారు. పోలీకలను బట్టి మీరు ఏమైనా గెస్ చేయగలరా..? తను మరెవరో కాదు.. ‘సీతారామం’లో సీతామహాలక్ష్మీ పాత్రలో నటించి కాదు కాదు జీవించిన మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో ఆమె అందానికి, అభినయానికి ప్రేక్షులకు ఫిదా అయ్యారు. హృదయాలను హత్తుకున్న ఈ సినిమాలో అమ్మడిని చూసిన చాలామంది ఆమెను తెలుగమ్మాయి అని భ్రమపడ్డారు. కానీ పాపది ముంబై.
ఇవి కూడా చదవండి
హిందీలో ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌తో ఈమె.. ప్రేక్షకులకు పరిచయమైంది. విట్టి దండూతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్ లాంటి చిత్రాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుంది. హిందీ జెర్సీ రీమేక్‌లో నటించి బాగా పాపులర్ అయ్యింది. తెలుగులో నటించిన ‘సీతారామం’తో స్టార్ స్టేటస్ సంపాదించింది. నానితో హాయ్ నాన్నలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో మెరిసింది. ప్రజంట్ ఆమెకు ఆపర్స్ క్యూ కడుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.