గురుమూర్తి, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం డీఆర్డీఓలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13ఏళ్ల క్రితం వివాహమైంది. 35 ఏళ్లకే రిటైర్ అయిన గురుమూర్తి హైదరాబాద్ మీర్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి అద్దెకి ఉంటున్నాడు. అయితే తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి.
అవి కాస్తా పెద్దవై.. దారుణ హత్యకు దారితీసింది. భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవులని ఎంచుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈనెల 13న తన పిల్లలను పంపాడు. అపార్ట్‌మెంట్‌లోనూ చాలామంది పండక్కి ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదనుగా బావించిన గురుమూర్తి ఈనెల 15న పండగరోజు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆమెను చంపి, ముక్కలు చేసి, కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎముకలు ఎండబెట్టి, పొడిగా చేసి.. దగ్గర్లో ఉన్న జిల్లెల్లగూడ చందనచెరువులో కలిపేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ధనుష్ అలా మాట్లాడేసరికి షాకయ్యా
రూ.30 కోట్ల బడ్జెట్! రూ.100 కోట్ల కలెక్షన్స్! ఈ హిట్ సినిమా OTTలో…
Prabhas: వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న డార్లింగ్.. మళ్లీ మారిన ప్రభాస్ లైనప్