చలికాలంలో మన శరీరం వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.. దీని కారణంగా గుండె మరింత ఎక్కువగా పంపు చేయవలసి ఉంటుంది.. దీంతో అనేక ఇతర కారణాల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అయితే.. చలికాలంలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎందుకు పెరుగుతుంది..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..? ఎలాంటి జాగ్రత్తలతో మనం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.. ఈ విషయాలను తెలుసుకోండి..
Heart Attack
గుండెపోటు సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే.. సాధారణంగా వేసవి, వర్షాకాలంతో పోలిస్తే.. శీతాకాలంలో గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతుంది.. ముఖ్యంగా చల్లని గాలులు, పెరుగుతున్న కాలుష్యం గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అయితే.. చలికాలంలో మన శరీరం వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.. దీని కారణంగా గుండె మరింత ఎక్కువగా పంపు చేయవలసి ఉంటుంది.. ఇంకా అనేక ఇతర కారణాల వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కావున శీతాకాలంలో మన గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలికాలంలో గుండెపోటు రాకుండా చేసే కొన్ని చర్యలు.. జాగ్రత్తల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.. వీటిని క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
శీతాకాలంలో గుండెపోటును ఎలా నివారించాలి?
- శారీరక వ్యాయామం: సరైన మొత్తంలో వ్యాయామం చేయడం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలి. చలికాలంలో బద్ధకం ఎక్కువగా ఉంటుంది. దానిని నివారించండి.. శారీరక శ్రమను పెంచుకోండి.
- హెల్తీ డైట్: చలికాలంలో సరైన ఆహారం చాలా ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం, మీ ఆహారంలో తక్కువ మొత్తంలో నూనె, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు తీసుకోండి. మీరు ఎక్కువగా వేయించిన, జంక్, ఫాస్ట్ ఫుడ్ తింటే.. మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
- ఒత్తిడిని నివారించండి: అధిక ఒత్తిడి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ధ్యానం, యోగా ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడతాయి. శీతాకాలంలో వీలైనంత సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి.
- రెగ్యులర్ చెకప్‌లు: మీరు మీ వైద్యునిచే నిర్ణీత వ్యవధిలో చెకప్‌లు చేయించుకోవాలి. రోజువారీ రొటీన్ కోసం అవసరమైన పరీక్షలు మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉండేలా చేస్తాయి.. దీంతో ఎలాంటి ప్రమాదం జరిగినా ముందుగానే పసిగట్టవచ్చు.
- మద్యపానం: సిగరెట్, బీడీ, హుక్కా, గంజాయి లాంటి దురలవాట్లు ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. ప్రజలు శీతాకాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటారు.. ఇది గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.. ఇలాంటి దురలవాట్లతోపాటు.. మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.