సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యారు. హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటుంటే మరికొంతమంది మాత్రం పలు వ్యాపారాలు చేస్తూ తమ లైఫ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వారిలో బబ్లూ ఒకడు. తెలుగులో కమెడియన్‌గా పలు చిత్రాల్లో నటించిన బబ్లూ.. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి.. అనంతరం స్టార్ హీరోల చిత్రాల్లో వరుసపెట్టి ఛాన్స్‌లు దక్కించుకున్నాడు. 20వ దశకంలో మాంచి క్రేజ్ సంపాదించిన బబ్లూ అకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యాడు.
సోషల్ మీడియాలో చాలా మంది ఇప్పుడు బబ్లూ ఎక్కడున్నాడు.? ఏం చేస్తున్నాడు.? అని గూగుల్ లో గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బబ్లూ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతని అసలు పేరు సదానంద్. జంద్యాలా తెరకెక్కించిన పోపుల పెట్టె సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ పాత్ర పేరు బబ్లూ ఆ పాత్రతోనే పాపులర్ అయ్యాడు. ఉదయ్ కిరణ్ నటించిన ‘చిత్రం’ మూవీతో కమెడియన్‌గా అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం హిట్ కావడంతో అతడి వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. ఇలా ఛాన్స్‌లు వస్తున్న తరుణంలో అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు బబ్లూ..
తాజాగా బబ్లూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్రం సినిమా మంచి విజయం సాధించిన తరువాత ఫుల్ బిజీ అయ్యాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది.జీవితం హాయిగా సాగిపోతూ ఉండగా.., నా కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా కోల్పోతూ . నా కుటుంబ సభ్యుల మరణం నన్ను ఎంతో బాధించింది. ఆ సమయంలో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అసలు ఇంట్లో నుంచి బయటికి భయరకు కూడా రాలేదు. దాని వల్ల సినిమాలకు దూరమయ్యాను. ఆ తరువాత సినిమాలు చేయాలి అని అనుకున్నప్పుడు నచ్చిన పాత్రలు రాలేదు. చిన్న పాత్రలే అయినా గుర్తింపు తెచ్చేవి అయితే చేయడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాను అని చెప్పుకొచ్చాడు బబ్లూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి