2025 మొదటి త్రైమాసికానికి సంబంధించి ఆపిల్ కంపెనీ ఆర్థిక ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ త్రైమాసిక ఆదాయం 124.3 బిలియన్లకు చేరుకుందని, గతేడాదితో పోల్చితే నాలుగు శాతం ఎక్కువని తెలిపారు. అలాగే ఆపిల్ ఇంటిలిజెన్స్ ను ఏప్రిల్ నెలలో భారతదేశంలో ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. అక్కడ స్థానికీరించిన ఇంగ్లిషుతో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ఆపిల్ ఇంటిలిజెన్స్ ను మరింత ముందుకు తీసుకువెళ్లే విధానంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
టిమ్ కుక్ మాట్లాడుతూ ఐఫోన్ ఇన్ స్టాల్ బేస్ ఆల్ టైమ్ హైకి పెరిగిందని తెలిపారు. డిసెంబర్ త్రైమాసికంలో యూఎస్ఏ, చైనా, ఇండియా, యూకే, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ లలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో గొప్ప ఫలితాలను సాధించామని, ముఖ్యంగా ఇండియాపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. ఈ త్రైమాసికంలో అక్కడ ఐఫోన్ అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా నిలిచిందన్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో నాలుగు కొత్త దుకాణాలను ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్, మూడో అతి పెద్ద పీసీ, టాబ్లెట్ల మార్కెట్ గా ఇండియా పేరు గాంచిందన్నారు. ఆపిల్ కంపెనీ కొత్త సీఎఫ్ వో కెవాన్ ఫరేఖ్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ తమ ఫోన్లకు బలమైన డిమాండ్ ఉందన్నారు. దీని కారణంగానే తమ వాటాదారులకు 30 బిలియన్ డాలర్లకు పైగా తిరిగి ఇవ్వడానికి అవకాశం కలిగిందన్నారు.
ఆపిల్ ఇంటిలిజెన్స్ పనిచేయాలంటే తాజాాగా విడుదల చేసిన ఐవోఎస్ 18.2, ఐప్యాడ్ ఓఎస్ 18.2, మ్యాక్ఓఎస్ సెక్యూరియా 15.2 తదితర ఫీచర్లు ఉండాలి. లేకపోతే అప్ డేట్ చేసుకోవాలి. ఈ ఏఐ ఫీచర్ కు ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సపోర్టు చేస్తాయి. అలాగే ఐప్యాడ్ లకు సంబంధించి ఏ17 చిప్, ఎంఐ చిప్ లతో పాటు తర్వాత వచ్చిన లేటెస్ట్ డివైజ్ లతో పనిచేస్తుంది. మ్యాక్స్ ఎంఐ చిప్ లతో పాటు తర్వాత వచ్చిన లేటెస్ట్ డివైజ్ లలో అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి