ఉదయాన్నే మీకు అనుకోని సంఘటన కనిపిస్తే ఎట్లా ఉంటుంది. ఓ రైతుకు ఇదే తరహ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిట్‌లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తెల్లారి చెరుకు తోటకు వెళ్లిన రైతు.. ఎదురుగా కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు.
Representative Image
Updated on: Feb 05, 2025 | 7:19 PM
ఓ రైతు యధాలాపంగా ప్రతీ రోజూ వెళ్తున్నట్టుగానే చెరకు తోటకు వెళ్లాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఉదయాన్నే వెళ్లిన ఆ రైతుకు.. పొదల్లో దాక్కున్నది చూడగా దెబ్బకు కంగుతిన్నాడు. ఎదురుగా కనిపించింది చూసి షాక్ అయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఉదయాన్నే చెరకు తోటకు వెళ్లిన రైతుకు పొదల్లో దాక్కుని ఉన్న పెద్దపులి కనిపిస్తే ఎలా ఉంటుందని రాసుకొచ్చాడు. అలాంటి సీన్ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిట్‌లో జరిగిందన్నాడు. పొలాల మధ్యలో ఉండే రోడ్డుపై ఓ రైతు బైక్‌పై వస్తుంటే అక్కడే పెద్దపులిని చూసి ఆగిపోయాడు. రివర్స్‌లో వచ్చిన దారిలోకి వెళ్లిపోవాలని చూశాడు. అయితే పొదల మధ్య నుంచి వచ్చిన ఆ క్రూర మృగం కూడా ఎవరిపైనా దాడి చేయకుండా అక్కడే సేద తీరడం విశేషం. కాగా, ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తోంది. దానిపై ఓ లుక్కేయండి.
A husbandman and a tiger encounter. This is what coexistence looks like. From Pilibhit. pic.twitter.com/4OHGCRXlgr
ఇవి కూడా చదవండి
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 3, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి