అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాస్, యాక్షన్, రొమాంటిక్, లవ్ ఇలా అన్ని ఎమోషన్స్ కలగలిపి యూత్ ఆకట్టుకునేలా సినిమాలను రూపొందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాడు. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ క్రేజ్ ఒక్కసారిగా మార్చేశారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్ గా చూపించనున్నాడు సందీప్ రెడ్డి. కొన్ని నెలలుగా వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో స్టార్ హీరోతో సందీప్ రెడ్డి సినిమా తీయబోతున్నారా ? అనే చర్చ మొదలైంది. సందీప్ మహేష్ బి బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నించారు. కానీ అది సెట్ కాలేదు. ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేస్తా అని సందీప్ చెప్పాడు.
అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సందీప్ రెడ్డి వంగ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ, చిరంజీవి సినిమా ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చిరంజీవి, సందీప్ భేటీ కూడా జరిగిందని తెలుస్తుంది. సందీప్ స్టైల్ వేరు, చిరంజీవి ఇమేజ్ వేరు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అని టాక్ వినపడగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎలా ఉంటుందా.? అని చర్చ జరుగుతుంది. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి