మన రోజువారీ ఆహారంలో ఎన్ని తిన్న అన్నం తినంత తృప్తిగా అస్సలు ఉండదు. అయితే బరువు పెరుగుతారనే భయంతో చాలా మంది దీనిని పూర్తిగా మానేస్తుంటారు. కానీ సరైన సమయంలో సరైన రీతిలో తింటే ఆరోగ్యానికి హాని లేకుండా బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. అది ఏలాగో తెలుసుకుందాం ఇప్పుడు.
ఏ టైమ్ కి రైస్ తినాలి..?
మధ్యాహ్నం అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదట. ఎందుకంటే ఈ సమయంలో శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది, జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. ముఖ్యంగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, హోల్ గ్రెయిన్స్ వంటి వాటిని తింటే శరీరానికి అవసరమైన ఫైబర్, మినరల్స్ అందుతాయి. ఇవి బరువు నియంత్రణలో సహాయపడతాయి అంటున్నారు నిపుణులు.
వైట్ రైస్ మంచివేనా..?
చాలా మంది వైట్ రైస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇందులో ఫైబర్ తక్కువగా ఉండటంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనికి బదులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ లేదా ఇతర సంపూర్ణ ధాన్యాలను ఎంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇవి కొవ్వును పెంచకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
డిన్నర్ టైమ్ రైస్..?
బరువు తగ్గాలని అనుకునేవారు రాత్రి వేళల్లో అన్నం తినకూడదు. ఎందుకంటే, రాత్రి సమయంలో శరీరానికి పెద్దగా శక్తి అవసరం ఉండదు. బియ్యంలో స్టార్చ్ అధికంగా ఉండడం వల్ల అది ఫ్యాట్‌గా మారే అవకాశం ఉంటుంది. అయితే రాత్రి వేళల్లో అన్నం తినాలనిపిస్తే బ్రౌన్ రైస్ తీసుకోవడం ఉత్తమం. లేదా చపాతీలు, రోటీలు, సూప్స్, సలాడ్స్ వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే సరైన రకం బియ్యం ఎంచుకుని సరైన సమయంలో తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మధ్యాహ్నం వేళల్లో అన్నం తినడం మంచిది. రాత్రి వేళల్లో తినడం తగ్గిస్తే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్, ఇతర సంపూర్ణ ధాన్యాలను తినడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.