ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ గురించే.. ఆయన ఎక్కడ ఉన్నారు? అసలు అలీ ఖమేనీ ఆరోగ్యంగా ఉన్నారా.. లేక కోమాలో ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి గత కొన్ని రోజులుగా ఇరాన్ సుప్రీం లీడర్ గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ వైపు నుంచి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యంగా ఉన్నారు అని కానీ.. లేదు అంటూ ఖండింస్తూ ఎటువంటి వార్తలు వినిపించలేదు. అంతకుముందు కొన్ని నివేదికల్లో సుప్రీం లీడర్ ఖమేనీ తన వారసుడిగా తన కుమారుడు మోజ్తాబాను ఎంచుకున్నారని పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కొన్ని మీడియా నివేదికలలో ఖమేనీ ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని కూడా చెబుతోంది. సుప్రీం నాయకుడి ఆరోగ్యం గురించి ఇటువంటి నివేదికలు కొత్తవి కావు. గత రెండు దశాబ్దాలలో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ గురించి చాలాసార్లు ఇటువంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
సుప్రీం లీడర్ కోమాలో ఉన్నారా?
అయతుల్లా అలీ ఖమేనీ అనేది ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పేరు కాదు. అతను 3 దశాబ్దాలకు పైగా ఇరాన్ దేశానికి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. ఆ దేశ అణు కార్యక్రమం, విదేశాంగ విధానంపై అపారమైన అధికారాలను కలిగి ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా ఖమేనీకి వ్యతిరేకంగా వెళ్లలేరు. అక్టోబరు 27న న్యూయార్క్ టైమ్స్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి ఖమేనీ ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. సుప్రీం లీడర్ కుమారుడు మోజ్తాబా ఖమేనీని అతని వారసుడిగా ఎన్నుకోవచ్చని మొదటిసారిగా NYT నివేదికలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
దీని తరువాత ఖమేనీ కోమాలోకి వెళ్లడం గురించి పుకార్లు షికారు చేస్తున్నారు. ఈ ఊహాగానాలు దాదాపు ఒక వారం నుంచి కొనసాగుతున్నాయి. అయితే ఈ సమయంలో ఇరాన్ కి సంబంధించిన రాష్ట్ర మీడియా లెబనాన్‌లో పోస్ట్ చేసిన ఇరాన్ రాయబారి మోజ్తాబా అమినీతో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేయడం ద్వారా ఈ ఊహాగానాలకు ముగింపు పలికింది .
పేజర్ దాడిలో ఇరాన్ రాయబారి మోజ్తబా అమినీకి గాయాలు
Iran’s ambassador to Beirut Mojtaba Amani whose eyes were injured successful the Hezbollah pager attacks successful September met Supreme Leader Ali Khamenei connected Sunday. In the meeting, helium told Khamenei, “My close oculus sees partially, and my near oculus is good but has immoderate inflammation.” pic.twitter.com/rkGnYZjymb
— Iran International English (@IranIntl_En) November 17, 2024
3 దశాబ్దాలుగా సుప్రీం లీడర్‌గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ
అంతకుముందు 2006, 2009, 2014, 2020 సంవత్సరాల్లో ఖమేనీ కోమాలోకి వెళ్లారని వార్తలు వినిపించాయి. అంతేకాదు జనవరి 2007 లో ఏకంగా అతను మరణించారనే పుకార్లు కూడా వచ్చాయి. మీడియా నివేదికల ప్రకారం అతను 2014 లో ప్రోస్టేట్ శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలుస్తోంది. అయితే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వ్యక్తిగత జీవితం వలె, అతని ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కూడా రహస్యంగానే ఉంటుంది.
85 ఏళ్ల ఖమేనీ ఇరాన్ రెండవ సుప్రీం నాయకుడు.. అతని కంటే ముందు 1979లో ఇస్లామిక్ విప్లవం నాయకుడు అయిన అయతుల్లా రుహోల్లా ఖొమేనీ ఇరాన్ మొదటి సుప్రీం నాయకుడు. 1989లో ఖొమేనీ మరణానంతరం.. ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాడు. అప్పటి నుంచి అయతుల్లా అలీ ఖమేనీ ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
11 రోజుల తర్వాత ఖమేనీ X ఖాతాలో పోస్ట్
దీంతో పాటు ఆయనపై మరో పోస్ట్ పెట్టారు. అయితే దీనికి ముందు అతని చివరి పోస్ట్ సుప్రీం లీడర్ గురించి.. దీంతో ఇరాన్ ఏదో దాచడానికి ప్రయత్నిస్తుందా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం ఎలా ఉంది అనే ప్రశ్నలు మరోసారి తలెత్తడానికి ఇదే కారణం?
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..