మెరుగైన ఆరోగ్యానికి కూరగాయలు, ఆకు కూరలతో పాటు పండ్లు కూడా కీలక ప్రాత పోషిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ల్‌లు, మినరల్స్ ఇతర పోషకాలు అందుతాయి.. అయితే కూరగాయలలో ఒకటైన బెండకాయ గురించి తప్పక తెలుసుకోవాలి..ఎందుకంటే.. ఇందులో బోలెడు ఔషధ గుణాలు నిండివున్నాయి. దీంతో డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం బెండకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
Updated on: Feb 12, 2025 | 6:59 AM
బెండకాయలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మన జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బెండకాయలోని పోషకాలు కొలెస్ట్రాల్, బిపిని నియంత్రించడంలో మేలు చేస్తుంది. బెండకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ బెండకాయ తినడం వల్ల బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది.
1 / 5
బెండకాయల్లో ఖనిజాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. బెండకాయలు తీసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇందులో ఉండే ఫోలేట్ కూడా హెల్త్ కి చాలా మంచిది. బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి బెండకాయ హెల్ప్ చేస్తుంది. బెండకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
2 / 5
బెండకాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. బెండకాయలను రెగ్యులర్‌గా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి అనేక రకాల ఇన్ఫెక్షన్స్‌కి దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా బెండకాయలు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది.
3 / 5
బెండకాయల్లో ఉండే జిగురు కారణంగా తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. బెండకాయలు తీసుకోవడం వల్ల హైడ్రేట్‌గా ఉండొచ్చు. బెండకాయల్లో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలు బలంగా మారడానికి సహాయపడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్య రాకుండా కాపాడుతుంది.
4 / 5
బెండకాయ ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బెండకాయ తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. చర్మం అందంగా కనిపిస్తుంది. బెండకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బెండకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి..
5 / 5