గేర్ మార్చిన ‘రూట్’.. రిటైర్మెంట్ ఏజ్‌లో ఊహకందని ఊచకోత.. 35 సెంచరీలతో దిగ్గజాలకే ఎసరేట్టేశాడు

2 hours ago 1

ENG vs PAK Test: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తరపున ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్‌మెన్ జో రూట్ సెంచరీ సాధించాడు. రూట్ తన టెస్టు కెరీర్‌లో 35వ సెంచరీని నమోదు చేశాడు. ముల్తాన్ మైదానంలో మూడో రోజు ఈ ఫీట్ చేశాడు. పాక్ గడ్డపై జో రూట్‌కి ఇదే తొలి సెంచరీ. 33 ఏళ్ల బ్యాట్స్‌మెన్ 63వ ఓవర్ రెండో బంతికి ఈ ఘనత సాధించాడు. ఈ సెంచరీతో జో రూట్ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, మహేల జయవర్ధనే, యూనిస్ ఖాన్‌లను వెనక్కి నెట్టాడు. ఈ బ్యాట్స్‌మెన్‌లందరూ టెస్టు క్రికెట్‌లో మొత్తం 34 సెంచరీలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు.

ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ పేరిట అత్యధిక సెంచరీలు ఉన్నాయి. 200 మ్యాచ్‌లు, 24 ఏళ్ల కెరీర్‌లో సచిన్ మొత్తం 51 టెస్టు సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కల్లిస్ రెండో స్థానంలో ఉన్నాడు. కల్లిస్ మొత్తం 45 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత రికీ పాంటింగ్ పేరు మీద మొత్తం 41 సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 38 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉండగా, మొత్తం 36 సెంచరీలు చేసిన రాహుల్ ద్రవిడ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్స్..

సచిన్ టెండూల్కర్ (భారత్) – 51

జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 45

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 41

కుమార సంగక్కర (శ్రీలంక) – 38

రాహుల్ ద్రావిడ్ (భారత్) – 36

జో రూట్ (ఇంగ్లండ్) – 35

యూనిస్ ఖాన్ (పాకిస్థాన్) – 34

సునీల్ గవాస్కర్ (భారతదేశం) – 34

బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 34

మహేల జయవర్ధనే (శ్రీలంక) – 34

పాకిస్థాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా శ్రీలంక బ్యాట్స్‌మెన్ కమిందు మెండిస్ రికార్డును సమం చేశాడు. కమిందు 2024లో వరుసగా 5 టెస్టు సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా ఇంగ్లండ్‌కు చెందిన ఓలీ పోప్, శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్ ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేశారు.

👏 R💯T! 😍

A time to retrieve 🙌

Match Centre: https://t.co/M5mJLlHALN

🇵🇰 #PAKvENG 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 | @Root66 pic.twitter.com/gl6aSuOE8Q

— England Cricket (@englandcricket) October 9, 2024

2024 సంవత్సరంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్స్..

జో రూట్ (ఇంగ్లండ్) – 5

కమిందు మెండిస్ (శ్రీలంక) – 5

కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 3

శుభ్‌మన్ గిల్ (భారత్) – 3

ఆలీ పోప్ (ఇంగ్లండ్) – 3

దీనికి ముందు, రూట్ ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా మారాడు. కుక్ 161 టెస్టుల్లో మొత్తం 12,472 పరుగులు చేశాడు. రూట్ 147 టెస్టుల్లో మొత్తం 12,502 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు

జో రూట్ – 12,502*

అలస్టర్ కుక్ – 12,472

గ్రాహం గూచ్ – 8900

అలెక్ స్టీవర్ట్ – 8463

డేవిడ్ గోవర్ – 8231

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో జో రూట్ 5000 పరుగులు పూర్తి చేశాడు. అదే సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article