ఆకు కూరల ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. ఆకు కూరల్లో ఒకటి మెంతి ఆకు..దీంతో చెప్పలేనన్నీ లాభాలు ఉన్నాయి. బ్లడ్ షుగర్ నియంత్రణ, బరువు ఊబకాయం తగ్గడం లో మెంతి ఆకు చాలా బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆకలి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెంతులు, మెంతికూర రుచికి చేదుగా వున్నప్పటికీ వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మెంతి ఆకు వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
Updated on: Feb 09, 2025 | 7:34 AM
మెంతి ఆకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మెంతి ఆకు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. మెంతులు, మెంతికూర కూడా బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి. మీరు బరువు తగ్గాలంటే మీరోజువారీ ఆహారం లేదా డైట్ ప్లాన్ లో మెంతి కూరను ఆకు కూరగా వండి తినేయొచ్చు.
1 / 5
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి ఆకులు చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిని సాధారణీకరించడంలో సహాయపడతాయి. మీ బ్లడ్ షుగర్ వస్తే మీకు మెంతి ఆకును తీసుకోవచ్చు. ఇందులో డయాబెటిస్ ను నియంత్రించే గుణాలు ఉన్నట్లు గుర్తించారు.
2 / 5
మెంతి ఆకులలో పొటాషియం, ఐరన్, విటమిన్ కె, సోడియం, డైటరీ ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్ మొదలైనవి సమృద్ధిగా నింది ఉంటాయి. ఇవి మనల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెంతి ఆకులలో గెలాక్టోమన్నన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండెను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతాయి.
3 / 5
శరీరంలో ఉండే పంచేంద్రియాలలో వచ్చే సమస్యను దూరం చేయడం లో మెంతికూర సహాయ పడుతుంది. శరీరంలో బ్లడ్ కొలస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమయం లో మీరు మెంతికూర తీసుకుంటే కొలస్త్రాల్ ను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది. నాడీ వ్యవస్థ, పక్షవాతం, మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి తదితర వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది.
4 / 5
మెంతి ఆకులలో విటమిన్ కె, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును అదుపులో వుంచుంది. పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిది. మెంతికూరతో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త స్థాయిలను మెరుగుపరుస్తుంది.
5 / 5