నూతన రాజగోపురాలపై కలశాలను ప్రతిష్టించి సప్తనదుల మంత్రజలంతో అభిషేకం గావించారు. వేడుక సందర్భంగా కర్ణాటకకు చెందిన భక్తుడు మంజునాథ్ హెలికాప్టర్ తో పుష్పవృష్టి కురిపించారు. కన్నుల పండువగా సాగిన ఈ వేడుకను చూసేందుకు భక్తజనం వేలాదిగా తరలివచ్చారు.. అలాగే ఆలయ ముంగిట, దేవతామూర్తుల ప్రతిష్టాపన, నవగ్రహాల మంటప ప్రారంభం అట్టహాసంగా జరిగింది.
Urukunda Eranna
శిఖరాగ్రాన స్వర్ణ కళాశాల ప్రతిష్ట శుభవేళ వేద ఘోష నింగిని తాకింది. భక్త నీరాజనం నేలన మురిసింది. ఆకాశం నుంచి విరుల వృష్టి కురుస్తుండగా ఉరుకుంద ఈరన్న స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం సంబరంగా సాగింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్న స్వామి కుంభాభిషేక మహోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్త జనం తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా హెలికాప్టర్ ద్వారా పుష్పాభిషేకం నిర్వహించారు.
వీడియో ఇక్కడ చూడండి..
బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే భక్తుడు 22 లక్షల రూపాయలు వెచ్చించి ఐదు టన్నుల పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు. కుంభోత్సవంలో పాల్గొన్న లక్ష మందికి పైగా భక్తజనం చూసి తరించారు. భక్తుల కోల ఆలం మధ్య వేదమంత్రోచ్ఛారణతో ఐదు రాజగోపురాలపై పూలవాన కురిపించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..