వాళ్లంతా కోలీవుడ్ టాప్ హీరోలు. ఒకప్పుడు తెలుగులోనూ వసూళ్ల సునామీ సృష్టించిన టాప్ స్టార్స్. అయినా ఇప్పుడు మాత్రం ఆ రేంజ్ కనిపించట్లేదు. సౌత్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తమిళ హీరోలు... ఇప్పుడు రీజినల్ స్టార్స్‌గా మిగిలిపోతున్నారు. గతంలో సత్తా చూపిన తెలుగు మార్కెట్‌లోనూ తమ మార్క్ చూపించలేకపోతున్నారు.
Phani CH | Edited By: Shaik Madar Saheb
Updated on: Feb 07, 2025 | 10:55 PM
వాళ్లంతా కోలీవుడ్ టాప్ హీరోలు. ఒకప్పుడు తెలుగులోనూ వసూళ్ల సునామీ సృష్టించిన టాప్ స్టార్స్. అయినా ఇప్పుడు మాత్రం ఆ రేంజ్ కనిపించట్లేదు. సౌత్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తమిళ హీరోలు... ఇప్పుడు రీజినల్ స్టార్స్‌గా మిగిలిపోతున్నారు. గతంలో సత్తా చూపిన తెలుగు మార్కెట్‌లోనూ తమ మార్క్ చూపించలేకపోతున్నారు.
1 / 5
నెక్ట్స్ వీక్ అజిత్ హీరోగా తెరకెక్కిన పట్టుదల తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. కోలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్ ఉన్న అజిత్, కొంత కాలంగా టాలీవుడ్‌లో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.
2 / 5
తన ప్రతీ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్న అజిత్, ఇక్కడ మార్కెట్ మాత్రం క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా తన ప్రతీ సినిమాకు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న విజయ్ కూడా తెలుగు మార్కెట్‌లో అనుకున్న రేంజ్‌లో బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు.
3 / 5
గతంలో టాలీవుడ్‌లో మంచి మార్కెట్ సాధించిన సూర్య లాంటి స్టార్స్ కూడా ఈ మధ్య కాలంలో వసూళ్ల విషయంలో తడబడుతున్నారు.ఒకప్పుడు తెలుగు మార్కెట్‌లో సంచలనాలు నమోదు చేసిన రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు కూడా ఇప్పుడు తడబడుతున్నారు.
4 / 5
జైలర్‌తో టాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లు సాధించిన రజనీ, వేట్టయన్‌తో నిరాశపరిచారు. విక్రమ్‌తో మంచి వసూళ్లు సాధించిన కమల్ హాసన్ భారతీయుడు 2తో డిజాస్టర్‌ను ఫేస్ చేశారు. తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్‌లో ఎదుగుతుంటే, తమిళ హీరోలు ఇలా రీజినల్ రేంజ్‌కు పడిపోవటం మీద చెన్నై సర్కిల్స్‌లో గట్టిగానే డిస్కషన్ జరుగుతోంది.
5 / 5