న్యూ పంబన్ బ్రిడ్జ్ నిజంగా వండర్. 1914లో నిర్మించిన పాత పంబన్ రైలు వంతెన 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతూ సాగింది. తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోయాయి. దానికి సమీపంలోనే కొత్త పంబన్ బ్రిడ్జ్‌ని ప్రభుత్వం నిర్మించింది అంటూ మంత్రి రాసుకొచ్చారు. అలాగే రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు. సరికొత్త టెక్నాలజీని కొత్తదానిలో ఉపయోగించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు. రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం వద్ద పంబన్ ద్వీపం మధ్య 1914లో పంబన్ బ్రిడ్జిని సముద్రంలో నిర్మించారు. అప్పట్లో 20 లక్షల రూపాయలు ఖర్చయినట్లు తెలుస్తోంది. 2.06 కి.మీ. పొడవైన వంతెనను 2006-07లో మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు. ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు, షిప్‌లు వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు పని చేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది. ఇప్పుడు అలాకాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: డిప్యూటీ సీఎంకు ఐకాన్ స్టార్ స్పెషల్ థ్యాంక్స్