అరటిపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే రెగ్యులర్ గా తినాలని చెబుతుంటారు.. ఇది ప్రతి సీజన్లోనూ సులభంగా లభిస్తుంది.. సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది.. సాధారణంగా అరటిపండును పండిన తర్వాతే తింటారు.. పచ్చి అరటిపండును చాలామంది నేరుగా తినరు.. కానీ దానిలోనే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Banana BenefitsImage Credit source: Getty Images
అరటిపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే రెగ్యులర్ గా తినాలని చెబుతుంటారు.. ఇది ప్రతి సీజన్లోనూ సులభంగా లభిస్తుంది.. సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది.. సాధారణంగా అరటిపండును పండిన తర్వాతే తింటారు.. పచ్చి అరటిపండును చాలామంది నేరుగా తినరు.. కానీ దానిలోనే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దక్షిణ భారతదేశంలో పచ్చి అరటిపండు నుంచి చిప్స్, కూరలు కూడా తయారుచేస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.. అయితే.. పండిన అరటిపండుతోపాటు.. పచ్చి అరటిపండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అరటిపండ్లలో ఫైబర్స్ ఎక్కువగా కనిపిస్తాయి.. ఇవి చెడు కొవ్వు కణాలను, అనేక మలినాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6, ప్రొవిటమిన్ ఎ, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, ఫినోలిక్ సమ్మేళనాలు వంటి అనేక లక్షణాలు పచ్చి అరటిపండులో ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఇంకా కావాలంటే పచ్చి అరటిపండును ఉడకబెట్టి, చిటికెడు ఉప్పు వేసుకుని తినవచ్చు. దీని వల్ల మీ పొట్ట ఆరోగ్యం చాలా బాగుంటుందని పేర్కొంటున్నారు. పచ్చి అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పచ్చి అరటిపండ్లలో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జీర్ణవ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది: పచ్చి అరటిపండు తీసుకోవడం షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు మధుమేహ సమస్యను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: పచ్చి అరటిపండు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటిపండులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది.. ఇది పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించగలదు.
ఊబకాయం నుంచి బయటపడేలా చేస్తుంది: ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. పచ్చి అరటిపండులో ఫైబర్ ఉంటుంది.. ఫైబర్ త్వరగా జీర్ణం కాదు, దీని కారణంగా కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. ఇది అతిగా తినడం, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
చర్మానికి కూడా మంచిది: పచ్చి అరటిపండులో అనేక రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ముఖంపై ముడతలను పోగొట్టడంలో సహాయపడుతుంది.