స్నేహితులకు ఖర్చు చేసిన ఫుడ్ బిల్లును పక్కాగా పంచాడో సీఏ. అందుకోసం రాసిన ఓ ఎక్సెల్ షీట్ నెట్టింట వైరల్‌గా మారింది. సరదాగా స్నేహితులంతా కలిసి రెస్టారంట్‌కు వెళ్లినప్పుడు బిల్లును అందరూ షేర్ చేసుకోవడం సహజమే..! మామూలుగా ఇలాంటప్పుడు ఎంత ఖర్చు అయ్యిందో చూసి అందరికీ సమానంగా పంచుతారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం కాస్త ప్రత్యేకంగా ఆలోచించాడు.
వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అతడు..స్నేహితులు ఎంత తిన్నారో, ఏమేం తిన్నారో లెక్కలేసి మరీ.. బిల్లును షేర్ చేశాడు. దీనికి సంబంధించి అతడు తయారు చేసిన ఓ ‘ఎక్సెల్ ఫుడ్ షీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. స్నేహ అనే ఓ యూజర్ ఈ ఫుడ్ షీట్ ఫొటోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. బిజినెస్ స్కూల్‌లో చదువుకుంటున్న తమ స్నేహితులు ఔటింగ్‌కు వెళ్లారనీ ఆ గ్రూప్‌లో ఓ సీఏ ఉన్నాడనీ తెలిపింది. వాళ్లకు అయిన మొత్తం బిల్లు ను అతడు ఎలా పంచాడో చూడండి అంటూ ఆమె రాసుకొచ్చారు. ఆ షీట్ ప్రకారం.. ఆరుగురు స్నేహితులు ఔటింగ్‌కు వెళ్లారు. ఇందులో ఫుడ్‌కు అయిన మొత్తం బిల్లును మొదట ఓ వ్యక్తి చెల్లించాడు. మరో వ్యక్తి టిప్పు ఇచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యబాబోయ్.. ఆ ఇంటి ఒక్క నెల కరెంట్ బిల్లు అక్షరాలా.. రూ.210 కోట్లా
కోహ్లీకి ఆ ఇన్నింగ్స్ చూపిస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు
అతన్ని చూడగానే తోకముడిచి పారిపోయిన సింహం !!
లైటర్ ఇచ్చేందుకు ఆకాశంలో నుంచి వచ్చాడు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్