కానీ..కేంద్రం వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుందా అన్నదే ఉత్కంఠ కలిగిస్తున్న విషయం. ఈ రెండు రాష్ట్రాలూ కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో భారీగా ఆదాయాన్ని అందిస్తున్నాయి. అందుకే…రిటర్న్స్ కూడా అదే స్థాయిలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. అందుకే..అంచనాలు ఇంకాస్త ఎక్కువగా ఉన్నాయి. పైగా..కేంద్రంతో సఖ్యంగా ఉంటూ ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టుకోవడం అనేది రాజకీయంగా కూడా కీలకమైన విషయం. మరి ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం ఎవరికి ఏమిస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
ఈ బడ్జెట్ గురించి చెప్పుకునే ముందు..అసలు గత బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఏ కేటాయింపులు చేసిందో ఓ సారి పరిశీలిద్దాం. 2024-25 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి భారీగానే నిధులు కేటాయించింది కేంద్రం. మొత్తంగా 50 వేల 475 కోట్ల రూపాయలు అందించింది. అప్పటి కేంద్ర బడ్జెట్‌లో దాదాపు ఇది 4%. అయితే..అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే..కేవలం అమరావతి నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది.