సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది తన స్నేహితుడిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
Keerthy Suresh, Dileep
సినీరంగంలో హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మహానటి సినిమాతు ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరూ సినీరంగానికి చెందినవారే. ఆమె తండ్రి ప్రముఖ నిర్మాత కాగా.. తల్లి ఒకప్పటి నటి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి.. మలయాళంలో మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా మారింది. తెలుగులో రామ్ పోతినేని సరసన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కీర్తి.. చిన్నప్పుడు ఓ స్టార్ హీరోకు కూతురిగా నటించింది.ఆ తర్వాత కొన్నాళ్లకు అతడికే ప్రేయసిగా కనిపించింది. అగ్ర కథానాయికగా బిజీగా ఉన్న సమయంలో ఆ స్టార్ హీరో పిలిచి మరీ తనను అంకుల్ అని పిలవద్దని చెప్పారట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. అతడే మలయాళీ నటుడు దిలీప్. 2002లో దిలీప్ హీరోగా నటించిన చిత్రం కుబేరన్. ఇందులో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. అందులో ఒకరు కీర్తి సురేష్. ఆ తర్వాత కొన్నాళ్లకు 2014లో వచ్చిన రింగ్ మాస్టర్ సినిమాలో దిలీప్ ప్రేయసిగా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
దిలీప్ సరసన హీరోయిన్ గా నటించేందుకు ఎక్కువగా ఆలోచించలేదని.. చిన్నప్పటి నుంచి అతడిని చూస్తూనే ఉన్నానని.. అతడేమి మారలేదని.. ఇప్పటికీ అలాగే ఉన్నాడని తెలిపింది. రింగ్ మాస్టర్ మూవీలో తనే తన గర్ల్ ఫ్రెండ్ అని తెలియగానే పిలిచి మరీ ఓ మాట చెప్పారట. చిన్నప్పుడు అంకుల్ అని పిలిచేదానివి.. ఇప్పుడు అలా పిలవద్దు.. కావాలంటే చేట్ట (అన్నయ్య) అని పిలవమని చెప్పారట. దీంతో సరే చేట్ట అని పిలిచినట్లు గుర్తు చేసుకుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన