ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు గరిష్ఠ స్థాయిలో వరుసగా 8వ సారి కేంద్ర వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో శనివారంనాడు ప్రవేశపెట్టారు. అయితే రైల్వే శాఖకు సంబంధించి ఎలాంటి కీలక ప్రకటనలు చేయలేదు. వార్షిక బడ్జెట్ 2025లో వరుసగా రెండో ఏడాది రైల్వే శాఖకు రూ.2,65,200 కోట్లు కేటాయించారు. రైల్వే కేటాయింపుల్లో భద్రత, ఎలక్ట్రిఫికేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైల్వే బడ్జెట్‌లో 66 వేల కోట్ల రూపాయలను పెన్షన్ ఫండ్‌కు కేటాయించగా.. కొత్త లైన్లు వేయడానికి రూ.32,235 కోట్లు వెచ్చించనున్నారు. లైన్ల డబ్లింగ్ కోసం రూ.32,000 కోట్లు, గేజ్ లైన్లుగా మార్చేందుకు రూ.4,550 కోట్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. విద్యుత్ లైన్లకు రూ.6,150 కోట్లు, సిబ్బంది సంక్షేమానికి రూ.833 కోట్లు కేటాయించారు. రైల్వే సిబ్బంది శిక్షణ నిమిత్తం రూ.301 కోట్లు వెచ్చించనున్నారు. అదే సమయంలో రైల్వే సేఫ్టీ ఫండ్‌కు రూ.45 వేల కోట్లు కేటాయించనున్నారు. సామాన్య రైల్వే ప్రయాణీకులకు మేలు కలిగే కీలక అంశాలు బడ్జెట్‌లో ఉన్నాయి. 17,500 నాన్ ఏసీ, స్లీపర్ కోచ్‌లను తయారు చేయనున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు.
ప్రస్తావన లేని కవచ్ కొత్త వెర్షన్
రైల్వే ప్రమాదాలను తగ్గించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని కింద దేశంలోని ప్రధాన రైల్వే మార్గాల్లో కవచ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 4.Oను ఇన్‌స్టాల్ చేసే పనులు శనవేగంగా జరుగుతున్నాయి. కవచ్ కొత్త వెర్షన్ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO)తో ఇటీవల ఆమోదించబడింది. అయితే బడ్జెట్‌లో దీనికి సంబంధించి ఎలాంటి కొత్త ప్రకటన చేయలేదు. దీనికి బదులుగా మునుపటి ప్రకటనలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం మేరకు భారతీయ రైల్వేలు అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఢిల్లీ-ముంబై మరియు ఢిల్లీ-కోల్‌కతా ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో కవచ్ కొత్త వెర్షన్‌కు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ముంబై-చెన్నై, చెన్నై-కోల్‌కతా మార్గాల్లో కూడా కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విధంగా మొత్తం దాదాపు 9 వేల కి.మీ పొడవునా ట్రాక్‌ను కచావ్‌తో అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రైల్వే కేటాయింపులు పెంచాలని వినతి..
రైల్వే బడ్జెట్ కేటాయింపులు ఈ సారి గత బడ్జెట్ కంటే 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కేటాయింపులను యధాతథంగా కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైల్వే అంచనాల ప్రకారం గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు 80 శాతం రైల్వే శాఖ ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిందని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Income taxation calculator tool