“కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రగతిశీల మరియు దూరదృష్టితో కూడిన ప్రకటనల కోసం గౌరవనీయులైన ఆర్థిక మంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మైనింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఆరు డొమైన్‌లలో పరివర్తనాత్మక సంస్కరణలను ప్రారంభించడం ఈ బడ్జెట్ లక్ష్యం అని గౌరవనీయ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు.
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ నేతల విమర్శలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించడం మంచిది కాదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచిన 90శాతానికి పైగా పథకాలు తెలంగాణకు కూడా వస్తాయన్నారు. విభజన చట్టంలోని హామీల ప్రకారమే ఏపీకి కేటాయింపులు చేశామన్న కిషన్ రెడ్డి, హామీ మేరకే అమరావతి, పోలవరం, రైల్వేజోన్‌కు నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు వచ్చిందన్నారు. అలాగే తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. అవసరాన్ని బట్టి తెలంగాణకు అన్ని రకాల పథకాలు అందించేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..