బాలీవుడ్ లో సెలబ్రెటీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ఓ ముఠా ప్రయత్నిస్తుంది. అలాగే రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది. ఇక ఇప్పుడు మరికొంతమంది సెలబ్రెటీలకు చంపుతామని బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీస్‌కు డెత్ త్రెట్, చంపేస్తాం అంటూ పాకిస్తాన్ నుంచి కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ సెలబ్రెటీలు కపిల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, సుగంధ మిశ్రా, రెమో డిసౌజాకు బెదిరింపులు వచ్చాయని తెలుస్తుంది. తమకు ఈమెయిల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు సెలబ్రెటీలు. ముంబై అంబోలీ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. 8 గంటల్లో రిప్లై ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయని సెలబ్రెటీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి
గతంలోనూ కొంతమంది బాలీవుడ్ సెలబ్రెటీలకు ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా పాక్ నుంచి కాల్స్ , మెయిల్స్ రావడంతో సెలబ్రెటీలతో పాటు వారి అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.