మొన్న సల్మాన్ ఇంటిపై కాల్పులు.. ఇప్పుడు సైఫ్‌కి కత్తిపోట్లు. బాద్‌షాతో పాటు మరికొందరికి హెచ్చరికలు. గుల్షన్‌కుమార్ మర్డర్ నుంచి గోవిందా కాలికి బుల్లెట్‌దాకా.. బాలీవుడ్‌లో అలజడి రేపుతోంది. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరగిన దాడితో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంతటి ఘోరం జరగడంతో బాలీవుడ్ భయందోళన చెందింది.
సైఫ్‌పై దాడి కన్నా ముందు మరో స్టార్ నటుడు షారూక్ ఖాన్ ఇంటిపైనా రెక్కీ జరిగిందనే ప్రచారం మరింత ఆందోళన రేకెత్తించింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని పలుమార్లు బెదిరింపు కాల్స్‌తో పాటు హత్యాయత్నాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరికొంత మంది బాలీవుడ్ నటులకు బెదిరింపు కాల్స్ రావడం కలకం రేపుతోంది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను చంపేస్తామంటూ ఏకంగా పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ రావడం పోలీసులకు సవాల్‌గా మారింది. కపిల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, సుగంధ మిశ్రా, రెమో డిసౌజాకు బెదిరింపులు వచ్చాయి. తమకు ఈమెయిల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై అంబోలీ పీఎస్‌లో కేసు నమోదు అయింది. 8 గంటల్లో రిప్లై ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: ఆర్జీవీకి బిగ్ షాక్.. 3 నెలల జైలు శిక్ష
Balakrishna: బాలయ్య పాట పాడితే.. ఎవరైనా చిందులేయాల్సిందే..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై మరోసారి సీఎం రేవంత్ కామెంట్స్
Rashmika Mandanna: ఆ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనుంది.. రష్మిక షాకింగ్ కామెంట్స్
TOP 9 ET News: ఏంటీ.. చరణ్ సినిమాలో మోనాలిసానా? | రూ.200 కోట్లు దాటిన వెంకీ సినిమా కలెక్షన్స్