మహారాష్ట్ర కొత్త సీఎంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఫడ్నవిస్, షిండే మధ్య కుర్చీ నీదానీదా అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. అయితే, ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు షిండే. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం షిండే తన రాజీనామాను అందజేశారు.
#WATCH | Maharashtra CM Eknath Shinde tenders his resignation arsenic CM to Governor CP Radhakrishnan, astatine Raj Bhavan successful Mumbai
Deputy CMs Ajit Pawar and Devendra Fadnavis are besides present.
Mahayuti confederation consisting BJP, Shiv Sena and NCP emerged victorious successful Maharashtra… pic.twitter.com/RGUl6chZOS
— ANI (@ANI) November 26, 2024
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాకూటమి విజయం సాధించింది. నవంబర్ 23 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి భారీ మెజారిటీ సాధించింది. మహాకూటమిలో భాగమైన బీజేపీ 132 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 41 సీట్లు గెలుచుకున్నాయి. అదే సమయంలో, మహా వికాస్ అఘాడిలో చేరిన శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) గరిష్టంగా 20 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 16 స్థానాలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) 10 స్థానాల్లో గెలుపొందాయి. సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పదవికి సంబంధించి ముంబైలో పలు దఫాలుగా సమావేశాలు జరిగినా ఢిల్లీలో ఖరారు కావాల్సి ఉంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చారు. అయితే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరినీ కలవకుండా ముంబైకి తిరిగి వచ్చారు. బీజేపీ అగ్రనేతలెవరినీ ఆయన కలవలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ వేడుకకు హాజరైన తర్వాత ఫడ్నవీస్ తిరిగి విమానాశ్రయానికి వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం సాధించింది. గెలుపు తర్వాత సీఎం ఎవరన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియనుంది. ఈరోజు సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని తర్వాత మహారాష్ట్రలో ఎవరి హస్తం ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. ఫడ్నవీస్ సీఎం అవుతారా లేక ఏక్‌నాథ్ షిండేకు కమాండ్ వస్తుందా.. లేక అధికారం వేరొకరికి దక్కుతుందా అనేది ఇప్పటికిప్పుడు నిర్ణయించలేదు.
మహారాష్ట్ర కొత్త సీఎంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఫడ్నవిస్, షిండే మధ్య కుర్చీ నీదానీదా అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. కీలక సమయంలో సంచలన ట్వీట్ చేశారు ఏక్‌నాథ్ షిండ్. తనను కలవడానికి రావొద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే. తన ఇంటి ముందు హడావిడి చేయొద్దంటూ నేతలకు సూచించారు. కొత్త సీఎంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో షిండే కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
సీట్ల పరంగా బీజేపీ అతిపెద్ద పార్టీ
మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 132 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 57 సీట్లు, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీ, అందుకే బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తోంది. అయితే ఇంకా ఎవరన్న దానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి బలమైన నేతగా పరిగణిస్తున్నారు.
మహాయుతి ఏకనాథ్ షిండే నాయకత్వంలో మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, రాజకీయ సమీకరణాలను సెట్ చేయడం ఫడ్నవీస్‌గా కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, మహాయుతికి తన వ్యూహంతో రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని అందించారు ఫడ్నవీస్. 2019లో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే కూటమిని విచ్ఛిన్నం చేసి కాంగ్రెస్, ఎన్‌సిపితో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..