ఇండస్ట్రీలో చాలా మంది నటులు బాలనటీనటులుగా అరంగేట్రం చేసినవారే. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించి..ఇప్పుడు హీరోహీరోయిన్లుగా సినీరంగాన్ని ఏలుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఈ హీరోయిన్ సైతం అలాంటి జాబితాలోకి చెందినదే. ఆమె మొదటి సినిమాకు కేవలం రూ.5 పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత భారతీయ సినిమాలో అత్యంత ఖరీదైన హీరోయిన్ గా మారింది. ఆమె మరెవరో కాదండి.
Actress
Updated on: Feb 12, 2025 | 12:05 PM
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్స్ ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది గ్లామర్ రోల్స్ కె పరిమితం అవుతుంటే.. మరికొంతమంది మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే హీరోలకు సమానంగా స్క్రీన్ పై కనిపిస్తూ నటనతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ కంటే కొత్త భామలే జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. వారిలో ఈ అమ్మడి పేరు తెగ వినిపిస్తుంది. వరుసగా హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ అలరిస్తుంది. అంతేకాదు హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుంది ఈ బ్యూటీ. రూ. 5 వేలతో మొదలు పెట్టి ఇప్పుడు రూ. 5కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. అలాగే ఇప్పుడు ఓ భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఏకంగా రూ. 50కోట్లు అందుకుంటుంది. ఇంతకూ ఎవరు ఆ ముద్దుగుమ్మ.?
తెలుగులో ఎంతో మంది హీరోయిన్ స్టార్స్ గా రాణిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఇతర భాషల నుంచి కూడా హీరోయిన్స్ మన దగ్గర సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఈ చిన్నదాన్ని పరభాషా నటి అంటే ఒప్పుకోవడం కష్టమే.. మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ చిన్నది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా తెలుగు తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇవి కూడా చదవండి
కాగా సాయి పల్లవి హీరోయిన్ అవ్వక ముందు పలు డాన్స్ షోల్లో పాల్గొంది. తెలుగు టీవీ షోలో కూడా చేసింది. ఢీ డాన్స్ షోలోనూ సాయి పల్లవి పాల్గొంది. అలాగే ఒకటి రెండు యాడ్స్ లోనూ నటించింది ఈ చిన్నది. కాగా డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన సాయి పల్లవి అప్పటిలో రూ. 5వేలు రెమ్యునరేషన్ అందుకునేదట.. డ్యాన్సర్‌గా రూ. 5 వేలు నుంచి హీరోయిన్‌గా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్‌కు సాయి పల్లవి ఎదిగింది. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో సీతగా కనిపించనుంది సాయి పల్లవి. ఈ మూవీ కోసం రూ. 50కోట్లు తీసుకుంటుందని టాక్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.