మంచు తుఫాన్‌తో దక్షిణ అమెరికా గజగజలాడుతోంది. ఇంత పెద్ద ఎత్తున మంచు తుఫాన్ రావడం 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. వేల విమానాలు రద్దయ్యాయి. హైవేలపై కార్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తుఫాన్ వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు జామయ్యాయి. స్కూళ్లను మూసివేశారు. మిస్సోరీ, కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, అర్కాన్సాస్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది.
టెక్సాస్, లూసియానా, మిస్సిసిప్పి, అలబామా, జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో 10 ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. అసాధారణ తుఫానుతో రోడ్లు మంచుతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అమెరికా వ్యాప్తంగా 2వేల100 విమానాలను రద్దు చేశారు. చలి తీవ్రత కారణంగా టెక్సాస్, జార్జియా, మిల్వాకీలలో నలుగురు వ్యక్తులు చనిపోయారు. మంచు తుఫాన్ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో.. కారు ప్రమాదాలు జరుగుతున్నాయి. మిస్సోరీలో పదుల సంఖ్యలో వాహనాలు హైవేపై మంచులో చిక్కుకుపోయాయి. లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ చుట్టూ భారీ ఎత్తున మంచు తుఫాను కురిసింది. ఈ ప్రాంతంలో 1963 తర్వాత వచ్చిన అతిపెద్ద హిమపాతం అని అధికారులు చెబుతున్నారు. మంచుతుఫానుపై లూసియాన్ గవర్నర్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. వచ్చే ఏడు రోజుల్లో చలి ప్రమాదకరంగా మారనుందని తెలిపారు. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. భారీ మంచు తుఫాను అమెరికాతో పాటు ఐరోపా దేశాలను బెంబెలెత్తేస్తోంది. మరో వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అక్కడి వెదర్ డిపార్టెంట్ మెంట్ హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండు రోజులు మరింత చలి.. బీ కేర్‌ఫుల్
భర్తతో గొడవపడి వచ్చిన మహిళపై సామూహిక లైంగికదాడి
H1B Visa: హెచ్1బి వీసా గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు