దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్‌కి కొల్‌కతా సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారంనాడు జీవిత ఖైదు శిక్ష విధించడం తెలిసిందే. మరణించే వరకు జైల్లోనే ఉంచాలని తీర్పు ఇచ్చింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించడం లేదంటూ న్యాయమూర్తి మరణశిక్ష విధించలేదు. సంజయ్ రాయ్‌కి మరణ శిక్ష పడకపోవడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తంచేశారు.
Breaking News
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్‌కి కొల్‌కతా సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించడం తెలిసిందే. అయితే దోషి సంజయ్ రాయ్‌కి మరణ శిక్ష పడకపోవడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం (జనవరి 21) కలకత్తా హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన అడ్వకేట్ జనరల్ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ చేశారు. దీన్ని విచారణకు స్వీకరించేందుకు డివిజన్ బెంచ్ అంగీకరించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.