97వ ఆస్కార్ నామినేషన్లు తాజాగా అనౌన్స్ చేశారు. కాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ నటించిన ‘ఆడు జీవితం’ సినిమా ఈ లిస్ట్ నుంచి తప్పుకుంది. ఈ చిత్రం ఆస్కార్‌కి ఎంపికైందని గతంలో వార్తలు వచ్చాయి. దాంతో మలయాళ ఇండస్ట్రీ ఫ్యాన్స్ తో పాటు పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఆడుజీతుతో పాటు కంక్వా , ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ కూడా ఆస్కార్ నామినేషన్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు లిస్ట్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : పెళ్ళికి ముందే హీరోతో ఆ యవ్వారం కానిచ్చేసింది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఎవరో తెలుసా.?
భారతీయ అమెరికన్ చిత్రం అనూజ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ గెలుచుకుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్‌గా నిర్మించారు. ఇది లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ చేయబడింది. ఫ్రెంచ్ మ్యూజికల్ కామెడీ ఎమిలియా పెరెజ్ పద్నాలుగు నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 2న అవార్డులను ప్రకటిస్తారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ అవార్డు వేడుక జరగనుంది.
ఇది కూడా చదవండి :అప్పుడు తెలుగులో బ్యాన్ చేశారు.. ఇప్పుడు పిలిచి మరీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. బాబోయ్ ఈ బ్యూటీ మామూల్ది కాదు
323 సినిమాలు ప్రాథమిక జాబితాకు అర్హత సాధించాయి. వీటిలో 207 ఉత్తమ చిత్రం పోటీలో ఉన్నాయి. ఈ 207 చిత్రాలలో ఆరు భారతీయ చిత్రాలు ఉన్నాయి. అయితే నామినేషన్ అనౌన్స్ చేసిన లిస్ట్ లో ఆడు జీవితం లేకపోవడమతొ ఫ్యాన్ నిరాశవ్యక్తం చేస్తున్నారు. ఆడు జీవిత నామినేషన్‌లోకి వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు మలయాళ ఇండస్ట్రీ ప్రేక్షకులు.ఆడు జీవితం సినిమా విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ప్రశంసలు రెండింటినీ గెలుచుకున్న చిత్రం. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా కష్టపడ్డారు. అంతేకాదు ఈ సినిమా 150 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.