ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇంతగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే..ఇంకా ఇండియా వెనకబడి ఉందేంటి..? నిన్న మొన్నటి వరకూ ఈ ప్రశ్నే వినిపించింది. ముఖ్యంగా ఎప్పుడైతే చైనా డీప్‌సీక్ AI మోడల్ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ డిస్కషన్ ఇంకాస్త ఎక్కువైంది. ఇప్పటికే అమెరికా నుంచి ఛాట్‌జీపీటీ వచ్చి..మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. దానికి పోటీగా డీప్‌సీక్‌ని తీసుకొచ్చింది చైనా.
మరి ఇండియా పరిస్థితేంటి అన్న చర్చ జరుగుతుండగానే కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ప్రకటన చేశారు. ఇండియా కూడా సొంతగా AI మోడల్‌ని తయారు చేసుకుంటుందని వెల్లడించారు. బహుశా మరో 8-10 నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముందనీ చెప్పారు. కాకపోతే..ఎవరు డెవలప్ చేస్తున్నారు..? ఇందుకు ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారు..? తదితర వివరాలేమీ చెప్పలేదు. కానీ బడ్జెట్‌లో మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రస్తావించారు. అంతే కాదు. AI విషయంలో ఇండియా ఎంత ఫోకస్డ్‌గా ఉందో కేటాయింపులతోనే క్లియర్‌గా చెప్పారు. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని ఎక్కువగా వినియోగించేలా చర్యలు చేపట్టనుంది కేంద్రం. ఆ మేరకు నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. AIకి సంబంధించి సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో