గేమ్ ఛేంజర్ తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన తర్వాతి సినిమాపై పూర్తిగా దృష్టి సారించాడు. గతంలో ‘ఉప్పెన’ వంటి అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మున్నాభాయ్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా గేమ్ ఛేంజర్ తరహాలోనే ఆర్ సీ 16 సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే హాలీవుడ్ తరహాలో కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నారు. 2023లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘ఓపెన్‌హైమర్’లో ఉపయోగించిన కొన్ని సాంకేతికతలను రామ్ చరణ్-శివన్నల సినిమాలోనూ ఉపయోగిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నెగటివ్ రీల్‌తో ‘ఓపెన్‌హైమర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఉత్తమ నాణ్యమైన ఫుటేజీని క్యాప్చర్ చేసింది. ‘ఓపెన్‌హైమర్’ సినిమా అద్భుతమైన క్వాలిటీ రావడానికి ఈ ప్రయోగమే కారణం. ఇప్పుడు ఆర్సీ 16 సినిమాకు కూడా అదే ప్రయోగం చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ‘దేవర’ ఖైదీ నెంబర్ 150, నేనొక్కడినే ‘ఆర్య’, ‘రోబో’, ‘రంగస్థలం’, సైరా, సరిలేరు నీకెవ్వరు, భారతీయుడు 2 తదితర సూపర్ హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన రత్నవేలు ఆర్‌సి 16 చిత్రానికి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే నెగెటివ్ ఫిల్మ్‌ని ఉపయోగించి రామ్ చరణ్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు రత్నవేలు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే కొడాక్‌తో చర్చలు జరిపాడు. రత్నవేలు ప్రయోగానికి కొడియాక్ ఇనిస్టిట్యూట్ సహాయం చేయనుంది. ‘ఏడెనిమిది ఏళ్ల నుంచి అంతా డిజిటల్ మయం అయింది. హాలీవుడ్ మళ్లీ నెగిటివ్ వినియోగించి సినిమా చిత్రీకరణలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నెగెటివ్ రీల్‌తో షూటింగ్ చేయడం తేలికైన విషయం కాదు. డిజిటల్ కెమెరాలతో షూటింగ్ చేస్తుంటే.. నటులు ఎన్ని టేక్స్ తీసుకున్నా సమస్య ఉండదు’ అని రత్నవేలు చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
Feeling immensely grateful and blessed arsenic #RC16 travel begins 🙏🏽 pic.twitter.com/HZSZVDbOyR
— BuchiBabuSana (@BuchiBabuSana) March 22, 2024
కాగా మైసూరులో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో జరుగుతోంది. శివన్న త్వరలో చిత్ర బృందంలో చేరనున్నారు.
Two of my favourite radical Collaborating again ❤️@aryasukku Sir @AlwaysRamcharan Sir@MythriOfficial @ThisIsDSP garu🤍🤗 pic.twitter.com/s3kDt9n7N4
— BuchiBabuSana (@BuchiBabuSana) March 25, 2024
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .