జీవితంలో ఎప్పడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదంటారు. మనిషి గుండె ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆగుతుందో అర్థం కావడం లేదు. రీసెంట్ టైమ్స్‌లో హర్ట్ ఎటాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా.. కళ్లముందే కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన విషాద ఘటన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Girl Heart Attack While Applying Nail Polish
ఈ స్పష్టిలో మనిషి జీవితం వింతైనది. ఎప్పుడు పుడతామో.. ఎప్పుడు చనిపోతామో కూడా తెలీదు. నెక్ట్స్ మినెట్ కూడా మన కంట్రోల్‌లో ఉండదు. కొన్ని సార్లు మనతో ఉండేవారు అప్పటి వరకు బానే ఉంటారు. కానీ అనూహ్యంగా గుండెపోటు వచ్చి కిందపడి చనిపోతారు. మరికొందరు నిద్రలోనే మరణిస్తారు. ఇలా మన నిత్య జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయి తన తల్లి నెయిల్ పెయింట్ వేసుకుంది. ఈ సమయంలో ఆ అమ్మాయికి ఊహించని సంఘటన జరిగింది. ఈ కథ తెలుసుకున్న తర్వాత, దేవుడు మానవులకు ఇచ్చిన జీవితం ఎంతో మీకు అర్థమవుతుంది..!
ఇంగ్లాండ్ దేశంలోని ఎల్లెస్మెర్ పోర్ట్‌లోని నివాసించే గామా గ్రిఫిత్స్ అనే మహిళ కుటుంబంలో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల ఎల్లా అనే చిన్నారి తన తల్లి గామా గ్రిఫిత్స్ చేత నెయిల్ పాలిష్‌ను తను చేసుకుంది. ఈ సమయంలో ఒక్కసారిగా అమ్మాయి శ్వాస ఆగిపోయింది. ఆమె కొద్దిసేపటికే అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కంగారుపడ్డ తల్లి గామా గ్రిఫిత్స్ చిన్నారి ఎల్లాకు CPR చేయడానికి ప్రయత్నిస్తుంది. అయినా ఫలితం లేకపోయింది. ఆమె వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే బాలిక కోమాలోకి వెళ్లింది.
అయితే, ఈ సమయంలో వైద్యులు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయారు. వైద్య సిబ్బంది వెంటనే బాలికకు CT-SCAN చేశారు. ఈ సమయంలో బాలికకు రెండవసారి గుండెపోటు వచ్చింది. బాలిక పరిస్థితిని చూసిన వైద్యులు చాలా ఆశ్చర్యపోయారు. చికిత్స సమయంలో, చిన్నారి ఎల్లా.. మేకి కేటెకోలమినెర్జిక్ పాలిమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (CPVT) అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు. ఇది గుండె చప్పుడు అకస్మాత్తుగా సక్రమంగా మారడంతోపాటు గుండెపోటు వంటి ప్రమాదం జరగుతుందని వైద్యులు చెప్పారు.
దీంతో వైద్యులు చిన్నారి తల్లిని విచారించగా.. ముందు రోజు రాత్రి జరిగిన హాలోవీన్ పార్టీలో చిన్నారి బాగా అలసిపోయిందని గుర్తించారు. ఆ తర్వాత వైద్యులు ఈ వ్యాధికి మందు లక్షణాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని వారాల తర్వాత చిన్నారికి శస్త్రచికిత్స చేయించారు. ఇందులో ఓ బాలిక గుండె దగ్గర ఉన్న సిరను కోసి అందులోకి అడ్రినలిన్ ఇంజెక్ట్ చేశారు. తద్వారా గుండెపోటు ప్రభావాలు తగ్గి, అమ్మాయికి కొత్త జీవితం లభిస్తుంది. అయితే చిన్నారిని వెంటిలేటర్ పైనే ఉంచాల్సిన పరిస్థితి. చివరికి చిన్నారి ఎల్లా ప్రాణాలతో బయటపడింది. కాగా, చిన్నారి ప్రాణాలు కాపాడిన ఆల్డర్ హే హాస్పిటల్‌లోని డాక్టర్ మైఖేల్ బోవ్స్ వైద్య బృందాన్ని బాలిక కుటుంబసభ్యులు ప్రశంసించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..