పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే పచ్చడో లేక కొబ్బరన్నమో చేసుకొని తింటాం. లేదంటే, ఈ మధ్య ఎక్కువగా కొబ్బరి ఎండబెట్టి ఆయిల్ కూడా పడుతున్నారు. కానీ, పచ్చి కొబ్బరి తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీనిలోని పోషకాలు శరీరంలోని అవయవాలు చురగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కొబ్బరిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు బరువు తగ్గించుకోవటానికి పచ్చి కొబ్బరిని తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరిని ఆరోగ్యానికి అద్భుత వరం అంటున్నారు ఆహార నిపుణులు.. ఆరోగ్యం, బలం, జ్ఞాపకశక్తిని అందించే పదార్థాల్లో కొబ్బరి కూడా ఒకటి. ఈ పచ్చి కొబ్బరితో మాంగనీస్, కాపర్ లాంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. కొబ్బరిని తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు… అందరూ తినొచ్చు. కొబ్బరిలో పిండిపదార్థం తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెరస్థాయులు నిలకడగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్లు కొబ్బరికాయలలో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పచ్చి కొబ్బరిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు.. కణాలు ఆక్సిడేటివ్ ప్రభావానికి గురికాకుండా చూస్తాయి. అంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయన్నమాట. కొబ్బరి మూత్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. గుండె సంబంధ సమస్యలను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. అల్జీమర్స్ రాకుండా అడ్డుకుని జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కొబ్బరి తినడం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది. దీంట్లో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ పారాసైటిక్ సమ్మేళనాలుంటాయి. ఇవి శరీరానికి హాని చేసే అన్ని రకాల సూక్ష్మజీవులను చంపేస్తాయి. కొబ్బరిని ఆకలిని నియంత్రించడంలో, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.