సినీరంగంలో నటీనటులుగా తమదైన ముద్ర వేయడం అంత ఈజీ కాదు. స్టార్ కావాలనే కలతో వందలాది మంది ముంబైకి వ్సతారు. కానీ ఆ కల అందరికీ నెరవేరదు. అలాంటి వారిలో ఈ నటుడు ఒకరు. ఎన్నో కలలతో ముంబై వచ్చి ఆర్థిక సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు నటుడిగా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? అతడే నటుడు విజయ్ వర్మ. నటుడు కావాలనే కలతో తన ఇంటి నుండి ముంబైకి పారిపోయాడు. కానీ ముంబై వచ్చిన తర్వాత డబ్బులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. విజయ్ వర్మ హైదరాబాద్ మార్వాడీ కుటుంబానికి చెందినవాడు. నిజానికి విజయ్ తండ్రి వ్యాపారవేత్త. ప్రతి తండ్రిలాగే, అతను కూడా తన కొడుకు కుటుంబ వ్యాపారాన్ని చేపట్టాలని కోరుకున్నాడు. కానీ విజయ్ నటుడిగా మారాలనుకున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూ విజయ్ మాట్లాడుతూ.. “నేను మా కుటుంబంలో చిన్నవాడిని.. అందుకే నన్ను అల్లారుముద్దుగా చూసుకున్నారు. కానీ మా నాన్నకు నచ్చని పనులు చేయడం.. నా అభిప్రాయాలు ఆయనకు నచ్చలేదు. నేను తన వ్యాపారాన్ని చూసుకోవాలనుకున్నాడు. కానీ అది కాకుండా నేను నటుడిగా మారాలనుకున్నాను. అప్పుడే నా అసలు పోరాటం మొదలైంది. నేను నా కోసం ఒక స్టాండ్ తీసుకున్నాను. కొన్నేళ్లు పోరాటం చేశాను. చివరకు ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చాను. 8 సంవత్సరాలు మా తండ్రితో మాట్లాడలేదు. కొన్ని రోజులుగా ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. చేతిలో డబ్బులు లేవు. బ్యాంక్ ఖాతాలో రూ.18 మాత్రమే ఉన్నారు. అప్పుడు నాకు కాల్ వచ్చింది. తమ సినిమాలో రిపోర్టర్ పాత్ర ఉందని చెప్పారు. ఆ పాత్రకు నాకు రూ.3000 వస్తాయని చెప్పారు. కానీ నాకు అలాంటి పాత్ర చేయాలనుకోలేదు. చివరకు నటించాను. నాకు నాపై నమ్మకం లేదు. షూటింగ్ లో ప్రతి టేక్ లో తడబడ్డాను. ఇంగ్లీషులో ఉండే ఈ పాత్ర ఇంగ్లిష్ రిపోర్టర్ పాత్రను పోషించడం అంత సులువు కాదు. దాంతో నన్ను సెట్ నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు నేను డబ్బు కోసం ఏమీ చేయనని అప్పుడు నిర్ణయించుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం విజయ్ వర్మ ఆస్తులు దాదాపు రూ.20 కోట్లు. అతడు ప్రతి సినిమాకు రూ.85 లక్షల నుంచి కోటి వరకు పారితోషికం తీసుకుంటాడు. అలాగే కొన్ని రోజులుగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన