గుండెపోటుకు గురైన వారికి గోల్డెన్ అవర్ (అమృత ఘడియలు) సద్వినియోగమైతే జీవితం నిలుస్తుంది. గ్రామీణులకు ఈ గోల్డెన్ అవర్ దాటడంతో ప్రాణాలొదుతున్న ఘటనలు అధికంగా ఉన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి నుంచి గుండెపోటుకు గురైన సగటు వ్యక్తిని పట్టణ ప్రాంతాలకు తీసుకుని వెళ్లాలంటే కనీసం 2 గంటలు పడుతుంది. ఈ లోగా జరగరాని నష్టం జరుగుతుంది. ఈ ముప్పును తప్పించేందుకు తక్షణ వైద్యంగా జిల్లాలోని ప్రత్తిపాడుతో సహా పది గవర్నమెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో(CHC) స్టెమీ కార్నర్లు అందు బాటులో ఉన్నాయి. బయట ఎంతో ఖరీదైన గుండె వైద్యం అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణులకు ఉచితంగా అందడం పేదలకు ‘ప్రాణ ప్రదం. ఈ సేవలు అందుబాటులోకి వచ్చాక నలుగురి ప్రాణాలు నిలిపామని ప్రత్తిపాడు డాక్టర్ సౌమ్య తెలిపారు.
స్టెమీ.. వైద్య సేవ ఏవిధంగా అందిస్తారు!
హృదయ ధమనులు మూసుకుపోతే సంభవించే గుండెపోటు.. స్టెమీ ( ST-ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్). సకాలంలో వైద్యం అందక ప్రాణాలు దక్కని తీరు గ్రామీణంలో ఎక్కువ. గుండె నొప్పితో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఏర్పాటు చేసిన స్టెమీ కార్నర్‌కు తరలించి గుండె కొట్టు కునేలా చేయడానికి డిఫిబ్రిలేటర్ (షాక్) ఇస్తారు. ఈసీజీ తదితర సత్వర పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందేవరకూ ఆరోగ్యం నిలకడగా ఉండేలా చేస్తారు. అత్యవసరమైతే టెనెక్టప్లేస్ ఇంజక్షన్ ఇస్తారు. అమృత ఘడియల్లో అందించే ఈ ఇంజక్షన్ ఖరీదు సుమారు రూ. 45 వేలు. దీన్ని ప్రభుత్వమే ఉచితంగా అంది స్తుంది. ఏరియా ఆసుపత్రిలు, సీహెచ్సీల్లో ఈ ఇంజక్షన్లు అన్నివేళలా అందుబాటులో ఉంటాయి.
కరోనా తర్వాత గుండె సంబంధ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. గుండెపోటుకు సంబంధించిన ఏ లక్షణాలు కనిపించినా తక్షణమే ఆసుపత్రికి రావాలి. సత్వర వైద్యం ఉచితంగా పొందవచ్చు. సీహెచ్సీల్లో గుండెపోటుకు తక్షణ వైద్యసేవలు విషయమై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం… ఆపత్క లంలో సంజీవనిగా పనిచేసే ఇంజక్షన్ గంటలోపే అందిస్తే ప్రాణాలు నిలుస్తాయని చెబుతున్నారు డా. సౌమ్య.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి